ముఖం మొత్తం మచ్చలు ఏర్పడ్డాయా.? ఎంతకూ అవి పోవడం లేదా.? ఎన్ని ఖరీదైన క్రీమ్, సీరంలు వాడినా ఫలితం ఉండటం లేదా.? మచ్చలతో బాగా విసిగిపోయారా.? అయితే చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే కనుక మచ్చలు పోవడమే కాదు.
మీ ముఖ చర్మం తెల్లగా( Skin White ) సైతం మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి.
పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి ఉడికించాలి.దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన బియ్యాన్ని పాలతో సహా వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక గుడ్డు పచ్చ సన్న తో పాటు పావు టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి.ఆపై మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.
ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.చర్మం బిగుతుగా మారుతుంది.ముడతలు చారలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.
వయసు పైబడిన సరే స్కిన్ యవ్వనంగా( Young Look ) మెరుస్తుంది.కాబట్టి మచ్చలు పోయి ముఖం తెల్లగా యవ్వనంగా మెరిసిపోవాలి అని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.