వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి( memory ) తగ్గడం అనేది చాలా కామన్.కానీ ఇటీవల రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.
బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, పోషకాల కొరత, ధూమపానం మద్యపానం అలవాట్లు తదితర అంశాలు మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.ఫలితంగా జ్ఞాపక శక్తి తగ్గడం, మెదడు చురుగ్గా పని చేయకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయి.
మీకు కూడా జ్ఞాపక శక్తి తగ్గుతున్నట్లు అనిపిస్తుందా.? బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలను కూడా మర్చిపోతున్నారా.? అయితే కచ్చితంగా జాగ్రత్త పడండి.
డైట్ లో మెదడు పనితీరును పెంచే ఆహారాలు చేర్చుకోండి.
ఇప్పుడు చెప్పబోయే లడ్డూ ఆ కోవకే చెబుతుంది.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు బాదం గింజలు( cup of almonds ) వేసి దోరగా వేయించుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వాల్ నట్స్( Wall nuts ) ను కూడా వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో డ్రై రోస్ట్ చేసుకున్న బాదం పప్పు మరియు వాల్ నట్స్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
చివరిగా పది నుంచి పదిహేను గింజ తొలగించిన సాఫ్ట్ డేట్స్( Soft dates )((ఖర్జూరాలు) వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఒక బాక్స్ లో నింపుకోవాలి.ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఈ లడ్డులు నిల్వ ఉంటాయి.రోజుకు ఒకటి చొప్పున ఈ నట్స్ లడ్డూను కనుక తీసుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.
ముఖ్యంగా వాల్‌నట్స్ మరియు బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పాలీఫెనాల్స్ ఉంటాయి.ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో, మెదడులోని ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో, మానసిక క్షీణతను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి.
జ్ఞాపకశక్తిని, ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి.ఖర్జూరాలు కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
అంతేకాకుండా పైన చెప్పుకున్న నట్స్ లడ్డూను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే.డయాబెటిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.హెయిర్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.రక్తపోటు సైతం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.