ప్రస్తుత వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు తదితర సీజనల్ వ్యాధులు ఎంతలా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వీటి కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.
ఏ పని చేయలేకపోతుంటారు.అయితే సీజనల్ వ్యాధులు( Seasonal diseases ) వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు కచ్చితంగా మనం మన ఇమ్యూనిటీ సిస్టం ను స్ట్రాంగ్ గా మార్చుకోవాల్సి ఉంటుంది.అయితే ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందించడానికి ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.
ప్రస్తుత వర్షాకాలంలో నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.అందుకోసం ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మ పండును( Lemon fruit ) తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసుకున్న నిమ్మ పండు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అల్లం తురుము ( Grate ginger )మరియు నాలుగు టేబుల్ స్పూన్లు తేనె( honey ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.
ఇక ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్( warm water ) తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలిపితే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.ఈ డ్రింక్ ను నేరుగా సేవించాలి.ఈ డ్రింక్ లో విటమిన్ సి మెండుగా ఉంటుంది.
అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.ప్రస్తుత వర్షాకాలంలో రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది.
జలుబు, దగ్గు వంటి సమస్యలు దెబ్బకు పరారవుతాయి.
గొంతు నొప్పి, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ డ్రింక్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తుంది.
వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.అంతేకాకుండా ఈ డ్రింక్ చర్మాన్ని గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.
మొటిమల సమస్యను తగ్గిస్తుంది.నెలసరి సమయంలో ఆడవారు ఈ డ్రింక్ ను తాగితే బాడీ తేలిగ్గా మారుతుంది.
నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.