ఈ పవర్ ఫుల్ హెయిర్ టానిక్ ను వాడితే ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది!

జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? ఎన్ని రకాల షాంపూలు మార్చిన ఫలితం ఉండటం లేదా.? హెయిర్ గ్రోత్ చాలా తక్కువగా ఉందా.‌.? జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారాయా.? అయితే ఈ సమస్యలన్నిటికీ ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ టానిక్ బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.ఈ టానిక్ ను తయారు చేసుకొని తరచూ వాడితే మీరు ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.

 Try This Powerful Tonic For Healthy And Thick Hair! Hair Tonic, Homemade Hair To-TeluguStop.com

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( cloves ) వేసుకొని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో వాటర్ జెల్లీ స్ట్రక్చర్ ( Water jelly structure )లోకి మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Healthy, Homemade Tonic, Roots, Thick, Powerfulton

జెల్ పూర్తిగా కూల్ అయ్యాక మిక్సీ జార్ లో వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకొని ఒక నిమిషం పాటు గ్రైండ్ చేస్తే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ హోమ్ మేడ్‌ హెయిర్ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి పది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Healthy, Homemade Tonic, Roots, Thick, Powerfulton

టానిక్ అప్లై చేసుకున్న గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ పవర్ ఫుల్ టానిక్ ను కనుక వాడితే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.కురులు సిల్కీగా, షైనీ గా మారతాయి.

జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు త‌గ్గు ముఖం పడతాయి.మరియు హెయిర్ హెల్తీగా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube