ప్రస్తుత రోజుల్లో స్త్రీలే కాదు ఎందరో పురుషులు కూడా హెయిర్ ఫాల్ ( Hair fall )వల్ల తీవ్రంగా సతమతం అవుతున్నారు.జుట్టు రాలే సమస్యకు కారణాలు అనేకం.
అలాగే జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా స్త్రీ, పురుషుల్లో హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి పదినిమిషాల పాటు ఉడికిస్తే జెల్ రెడీ అవుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని కాస్త చల్లారబెట్టి క్లాత్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కలబంద ముక్కలు,( Aloe Vera Slices ) రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు( Ginger slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ ముందుగా తయారుచేసి పెట్టుకున్న అవిసె గింజల జెల్ మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి బాగా మిక్స్ చేస్తే వండర్ ఫుల్ హెయిర్ సీరం రెడీ అవుతుంది.ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాలు అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ సీరంను కనుక వాడితే జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.జుట్టు రాలే సమస్యకు అడ్డుకట్ట పడుతుంది.అలాగే ఈ సీరం కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
పల్చటి కురులను ఒత్తుగా మారుస్తుంది.వారానికి ఒకసారి ఈ సీరంను వాడటం వల్ల హెయిర్ ఫాల్ తగ్గటమే కాకుండా హెయిర్ గ్రోత్ పెరుగుతుంది.
అదే సమయంలో చుండ్రు సమస్య నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది.