జయం రవి( Jayam Ravi ).దర్శకుడు తేజ తీసిన జయం సినిమాకు రీమేక్ గా తమిళ్ లో అదే పేరు తో వచ్చిన జయం సినిమాలో హీరోగా నటించడం తో రవి కి జయం సినిమా ఇంటి పేరు అయ్యింది.
ఈ సినిమా కన్నా ముందే చాల సినిమాల్లో సినిమాల్లో రవి నటించిన దీనికి వచ్చిన పేరు మరే సినిమాకు రాలేదు.అందుకే రవి ఇంటి పేరు గా జయం స్థిరపడిపోయింది.
ఇక జయం రవి తమిళ్ లో పెద్ద హీరో గా ఉన్నప్పటికీ అయన భార్య ఆర్తి గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా సాగుతూ ఉంటుంది.ఒక హీరో భార్య గా ఆమెకు పేరు ఉండటం పెద్ద విశేషమేమీ లేదు కానీ, జయం రవి భార్య ఆర్తి( Arti ) చాలా మంది హీరోల భార్యల కన్నా కూడా స్పెషల్ అని చెప్పాలి.

ఆర్తి కి సోషల్ మీడియాలో కూడా చాల పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు.అయితే ఆమె ఒక సోషల్ మీడియా స్టార్ మరియు ఒక వ్యాపార వేత్త( businessman ).కరోనా కష్ట సమయంలో ఆమె ఇంస్టా ఫాలోవర్స్ అందరిని ఒక్క చోట చేర్చి సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసింది.కొన్ని బ్రాండ్స్ కి కూడా ఆర్తి అంబాసిడర్ గా కొనసాగడం విశేషం.
ఇక కుటుంబం మొత్తం కూడా ఆర్తి దగ్గర ఉండి చూసుకోవడం మాత్రమే కాదు జయం రవి కి అన్ని విషయాల్లో తన సహాయ సహకారాలు ఉంటాయి.అయన సినిమాలకు సంబందించిన కథ చర్చల్లో కూడా ఆర్తి ఎప్పుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుని కుటుంబ వ్యాపారాలను కూడా పద్దతిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఇక జయం రవి కి సంబందించిన స్టైలింగ్ వంటివి కూడా ఆర్తి చూసుకుంటారు.

టాలీవుడ్ లో నమ్రత ( namratha )తర్వాత అంత పెద్ద ఎత్తున అన్ని విషయాల్లో కేర్ తీసుకునే హీరో వైఫ్ గా ఆర్తి ముందు వరసలో ఉంటారు.అయితే ఆర్తి ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం వాల్ల అమ్మగారు అని చెప్తుంది ఆర్తి.ఆమె ఒక టీవీ నిర్మాత కావడం వల్ల ఆర్తి ముందు నుంచి అంతే స్ట్రాంగ్ గా గ్రో అయ్యారు.
అందువల్ల ఏ విషయాన్నీ ఎలా మ్యానేజ్ చేయాలి, బుడ్జెస్ట్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనే గ్రిప్ వచ్చిందట.దాంతో ఆమె ఇప్పుడు చాల ఈజీ గా జయం రవి ఫామిలీ, మరియు బిజినెస్ వ్యవహారాలను చూసుకోగలుగుతున్నారు .