ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టిన కీర్తి సురేష్.. మొత్తానికి గుడ్ న్యూస్ చెబుతుందిగా?

టాలీవుడ్( Tollywood ) ముద్దుగుమ్మ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.

 Keerthy Suresh Has Put A Stop To Those Rumours , Keerthy Suresh, Rumours, Chand-TeluguStop.com

తన అందం తగ్గటు తను కూడా ఎంత హోమ్లీ గా కనిపిస్తుంది.తను మోడలింగ్ రంగం నుండి మంచి గుర్తింపు పొంది ఆ తర్వాతే సినిమా పరిశ్రమకు పరిచయమైంది.

ఇక ఆమె సినిమాలలో ఎంచుకునే పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి.

Telugu Akkineninaga, Chandu Modeti, Keerthy Suresh, Rumours-Movie

కీర్తి సురేష్ తొలిసారిగా 2000 లో బాలనటిగా పైలెట్స్ అనే మలయాళం సినిమా( Malayalam movie ) ద్వారా వెండితెర లో అడుగు పెట్టగా.తరువాత తమిళ సినిమాలలో నటించింది‌.ఇక 2016లో నేను శైలజ సినిమా( nenu Shailaja movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.పైగా మంచి అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.

మహానటి సినిమా తర్వాత కూడా పలు సక్సెస్ లు అందుకుంది ఈ బ్యూటీ.అంతేకాకుండా సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ లుక్ లో కనిపించి తనలో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించింది.

ఇక ఇటీవలే దసరా( Dussehra ) సినిమాతో ముందుకు రాగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Akkineninaga, Chandu Modeti, Keerthy Suresh, Rumours-Movie

అయితే ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కొత్త సినిమాలకు సైన్ చేయలేదని గతం లో సైన్ చేసి ఉన్న భోళాశంకర్ సినిమాలో మాత్రమే నటిస్తుందని.కొత్త సినిమాలు చేయకపోవడం కారణం తను చేసిన ఎక్స్పోజింగ్ లని తెలిసింది.దీంతో ఆమెను తెలుగు హీరోలు దూరం పెడుతున్నారని గత కొన్ని రోజుల నుండి బాగా వార్తలు వస్తున్నాయి.

కానీ ఇందులో నిజం లేదు అని తాజాగా నిరూపించింది కీర్తి సురేష్.పుకార్లకు పుల్ స్టాప్ చెప్పి మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పేసింది.త్వరలో చందు మొడేటి, అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా ఫిక్సయింది.ఇక ఈ సినిమా జి2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందనుంది.

త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తుంది.ఇక సెకండ్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.

ఈ విషయం తెలియటంతో కీర్తి సురేష్ అభిమానులు సంతోషంలో మునుగుతున్నారు.ఇంతకాలం తనపై వచ్చిన వార్తలలో నిజం లేదు అని స్పష్టం చేశారు.

ఇక కీర్తి సురేష్ బోళశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలు సక్సెస్ అయితే కీర్తి సురేష్ కు వరుస పెట్టి అవకాశాలు రావడం ఖాయమని చెప్పాలి.

ఇక త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube