టీడీపీ కి తలనొప్పిగా తిరువూరు ఎమ్మెల్యే ! ఆందోళనకు దిగిన మహిళలు 

తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు( MLA Kolikapudi Srinivasa Rao ) వ్యవహారం ఆ పార్టీ కి పెద్ద తలనొప్పిగా మారింది.టిడిపి ఎమ్మెల్యేగా మొదటిసారిగా శ్రీనివాసరావు గెలిచిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదంలో శ్రీనివాసరావు పేరు వినిపిస్తూనే ఉంది .

 Women Protest Against Tiruvuru Mla Kolikapudi Srinivasa Rao Details, Women Prote-TeluguStop.com

ఇటీవల కాలంలో ఆయనపై సొంత పార్టీ నాయకుల నుంచి అనేక విమర్శలు,  ఫిర్యాదులు టిడిపి అధిష్టానానికి చేరుతున్నాయి.దీంతో ఈ ఎమ్మెల్యే వ్యవహారం టిడిపి అధిష్టానానికి( TDP ) తలనొప్పిగా మారింది.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసూళ్లకు పాల్పడుతున్నారని, కొలిక పూడిపై అనేక విమర్శలు వస్తున్నాయి .తాగగా ఆయన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిట్టేల మహిళలు ఆందోళనకు దిగారు.  ఈ ఎమ్మెల్యే మాకు వద్దంటూ నిరసన తెలిపారు .తక్షణమే సీఎం చంద్రబాబు( CM Chandrababu ) కొలుకులపూడి విషయంలో స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Telugu Cm Chandrababu, Mlakolikapudi, Tdp Mla, Tiruvuru Mla, Tiruvuru Tdp-Politi

ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.అసభ్యకర సందేశాలు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు మహిళలను వేధిస్తున్న ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.  తిరువూరు నియోజకవర్గ( Tiruvuru Constituency ) టిడిపిలో గత వారం రోజులుగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలకు పులిస్టాప్ పెట్టేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది .పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దిగుతున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు కు ఇప్పటికే దూకుడు తగ్గించాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి.  తిరువూరు మండలంలోని చిట్టెల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే బహిరంగంగా దూషించడమే కాక గుద్దలు ఊడదీసి కొడతానంటూ అసభ్య పదజాలంతో తిట్టడంతో నియోజకవర్గంలోని టిడిపి వర్గాలు నిరసనలకు దిగాయి.ఈ నేపథ్యంలో చంద్రబాబు ,రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ను కలిసిన నాయకులు ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు. 

Telugu Cm Chandrababu, Mlakolikapudi, Tdp Mla, Tiruvuru Mla, Tiruvuru Tdp-Politi

ఇప్పటివరకు నియోజకవర్గంలోని సీనియర్ల ను పట్టించుకోలేదనే ఆరోపణల పైన టిడిపి అధిష్టానం సీరియస్ అయింది .తిరువూరు న రక్షించండి నినాదంతో సోమవారం సాయంత్రం పట్టణంలో పాదయాత్ర చేపడుతున్నట్లు కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు .అయితే అధిష్టానం ఈ విషయంలో సీరియస్ కావడంతో దానిని విరమించుకున్నారు.  సోషల్ మీడియా వేదికగా అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఎమ్మెల్యే పోస్టింగ్ పెట్టడం పైన టిడిపిలో ఎమ్మెల్యే తీరుపై చర్చ జరుగుతోంది.

అనివర్గాలను దూరం చేసుకునే విధంగా పార్టీకి నష్టం చేకూర్చేలా కొలికలపూడి శ్రీనివాసరావు వ్యవహరిస్తున్న తీరుపై అధిష్టానం సీరియస్ గా ఉండడంతో పాటు ఆయనపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube