ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, గంటలు తరబడి కూర్చుని ఉండటం, ప్రెగ్నెన్సీ తదితర కారణాల వల్ల చాలా మందికి పొట్ట భారీగా సాగిపోతూ ఉంటుంది.దాంతో పెరిగిన పొట్టను తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ను తీసుకుంటే ఎంత వేలాడే పొట్ట అయినా నెల రోజుల్లో మాయం అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం భారీగా పెరిగిన పొట్టను కరిగించే ఆ డ్రింక్ ఏంటో.
దాన్ని ఎలా తయారు చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.
ముందు నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.అలాగే ఒక చిన్న సైజు యాపిల్ పండును తీసుకుని శుభ్రంగా నీటిలో సన్నగా తురుముకోవాలి.
అలాగే అర అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని పొట్టు తొలగించి వాటర్ లో కడిగి తురుముకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో అల్లం తురుము, వెల్లుల్లి తురుము, రెండు టేబుల్ స్పూన్లు యాపిల్ తురుము వేసుకోవాలి.

ఆ తర్వాత గ్లాస్ నిండా వాటర్ పోసి బాగా మిక్స్ చేసి పది నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేస్తే.మన డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ డ్రింక్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించాలి.ప్రతి రోజూ ఈ డ్రింక్ ను తీసుకుంటే గనుక పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.దాంతో వేలాడే పొట్ట కాస్త కొద్ది రోజుల్లోనే టైట్ గా మారుతుంది.
పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు.కాబట్టి బాన పొట్టతో బాధపడేవారు తప్పకుండా ఈ డ్రింక్ ను ట్రై చేయండి.