టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు చిరంజీవి.
ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.తాజాగా అనిల్ రవిపూడి కాంబోలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు చిరంజీవి.
ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా, ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.రీసెంట్ గా తన టీమ్ ని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా విడుదల చేశారు.అయితే అనిల్ రావిపూడి ఐడియాలజి గురించి చెప్పాల్సిన పనిలేదు.
తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒకటి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తారు.ఇక తాజాగా చిరంజీవి మూవీ కోసం అనిల్ భారీగానే ప్లానే వేసినట్టు తెలుస్తోంది.మెగా157 కోసం కూడా, అనిల్ ఎన్నో ఎట్రాక్షన్స్ ను సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తోంది.చాలా కాలం తర్వాత చిరు తో ఈ సినిమాలో ఒక పాట పాడించనున్న అనిల్, దాంతో పాటూ తాజాగా ఈ మూవీలో వెంకటేష్ ( Venkatesh )తో ఒక గెస్ట్ రోల్ చేయించబోతున్నాడట.

నిజానికి వెంకీది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమె కాదట, అతని పాత్ర కోసం అనిల్ రావిపూడి స్పెషల్ గా ఒక ఫైట్ తో పాటు చిరు, వెంకీ వీరిద్దరి కాంబోలో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేశారట.ఆ పాట ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తోంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి తో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తోంది.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్త సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.