ఓవియా(oviya).తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.ఏదో ఒక విషయంతో సంచలనం అవుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.కేరళలోని తిరుచూర్ గ్రామానికి చెందిన ఓవియా బిఎ (BA)పూర్తిచేసి 2007లో నటిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.కంగారు అనే మలయాళ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత ఇది నా లవ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.అంతేకాకుండా 90 ఎం.ఎల్ అనే సినిమాతో సెన్సేషన్ గా కూడా నిలిచింది.

ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉంది అంటూ అప్పట్లో ఆమె మీద కేసులు కూడా నమోదు అయ్యాయి.అంతేకాకుండా తమిళ బిగ్ బాస్ షో (Tamil Bigg Boss Show)లో ఆమె సూసైడ్ చేసుకోవాలి అనుకోవడం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ గా నిలిచింది.ఈ విషయం సంచలనంగా కూడా మారింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆరవ్(Bigg Boss contestant Aarav తో ప్రేమాయణం జరిపి ఆ తర్వాత బ్రేకప్ కూడా చెప్పింది.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
వరుసగా ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది.
ఈమె కాంచన సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సంభవం అనే సినిమాలో నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఓవియా మరోసారి వార్తల్లో నిలిచింది.ఇటీవల ఒక బీచ్ కి వెళ్ళింది.
అక్కడ తన స్నేహితులు చేపల కోసం వల వేస్తున్నట్లు చూపించింది.అంతేకాకుండా తాను సిగరెట్ తాగుతున్న వీడియోని కూడా షేర్ చేసింది.
ఆ వీడియో వైరల్ కావడంతో కొందరు నెగిటివ్గా స్పందిస్తుండగా మరికొందరు సిగరెట్ తాగుతూ ఇలా పబ్లిక్ గా పోస్ట్ చేయడం అన్నది చాలా గ్రేట్ నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.