సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda)హీరోగా బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) డైరెక్షన్ లో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)డ్యూయల్ రోల్ లో తెరకెక్కిన జాక్ మూవీ ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ట్రైలర్ లో ఉన్న కొన్ని డైలాగ్స్ వల్ల ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వస్తుందని అందరూ భావించారు.అయితే ఈ సినిమాకు యూ/ఏ(U/A) సర్టిఫికెట్ రావడం గమనార్హం.
ఇప్పటికే విడుదలైన జాక్ ట్రైలర్(Jack trailer) కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ ట్రైలర్ కు దాదాపుగా 10 మిలియన్ల వ్యూస్ యూట్యూబ్ లో రావడం గమనార్హం.
సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు పారితోషికానికి బదులుగా నైజాం ఏరియా హక్కులను తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

వైష్ణవి చైతన్య బేబీ(Vaishnavi Chaitanya Baby) తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.డ్యూయల్ రోల్ లో వైష్ణవి చైతన్య ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో బిజీ అవుతుండగా ఆమె కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరే ఛాన్స్ అయితే ఉంటుంది.

సిద్ధు జొన్నలగడ్డ సైతం సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటుండగా జాక్ మూవీ కమర్షియల్ లెక్కలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.సిద్ధును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.