ముఖ్యంగా చెప్పాలంటే వేసవి కాలంలో మండే ఎండలకు ప్రజలు ఎక్కువగా చల్లదనాన్ని కోరుకుంటారు.ఇందులో ముఖ్యంగా శరీరానికి చలువ చేసే పానీయాలను ఎక్కువగా తీసుకుంటుంటారు.
అందులో ముఖ్యమైనవి లస్సి మరియు మజ్జిగ అనీ నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే మజ్జిగ ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే గ్యాస్, మలబద్ధకం, కడుపులో( Gas, constipation, , stomach ) మంట ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి అయినా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఇది చెడు బ్యాక్టీరియాను( Bad bacteria ) నాశనం చేసి జీవ క్రియను మెరుగుపరుస్తుంది.మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి, మినరల్స్ సమతుల్యంగా ఉంటాయి.మరి ముఖ్యంగా వేసవి కాలంలో మజ్జిగాను తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్( Dehydration ) కు గురి కాకుండా ఉంటుంది.సాధారణంగా వర్షాకాలం, చలికాలంలో కన్నా వేసవి కాలంలో మజ్జిగ వినియోగం పెరుగుతుంది.
ఎందుకంటే ఇది వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.ఇంకా చెప్పాలంటే వడదెబ్బ తగలకుండా ఉండడంతో పాటు అదిక దాహాన్ని కూడా తీరుస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే మజ్జిగలో జిలకర్ర, సబ్జా గింజలు, ధనియాలు, ఉప్పు కలుపుకొని తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

అలాగే మజ్జిగ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.చెడు బ్యాక్టీరియాను తగ్గించి గ్యాస్టిక్ సమస్యలు రాకుండా చేస్తుంది.భోజనంలో మజ్జిగను కలుపుకొని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయి.
మజ్జిగ తాగిన తర్వాత ప్రశాంతత తాజాదనాన్ని పొందుతారు.దానీ చల్లని విశ్రాంతి గుణాలు మీ మనస్సును ఉత్సాహంగా ఉంచుతాయి.
ముఖ్యంగా చెప్పాలంటే మధ్యాహ్నం పూట మజ్జిగ తాగడం వల్ల మీ పోషకాహార శక్తి పెరిగి మీరు తాజాగా ఉత్సాహంగా ఉంటారు.అందుకోసం వేసవి కాలంలో క్రమం తప్పకుండా మజ్జిగను తీసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి.