టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు(Samantha) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.2012 సంవత్సరంలో తమన్నా ట్విట్టర్ ప్రొఫైల్ ను ఓపెన్ చేయడం జరిగింది.అయితే కొంతకాలం క్రితం తమన్నా ట్విట్టర్ పోస్ట్ (Twitter post)లను డిలీట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అయితే ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం ఆమె బిజీగానే ఉన్నారు.
అయితే తాజాగా సమంత ట్విట్టర్ (Samantha Twitter)లోకి రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం.ఈరోజు ఆమె తొలి పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.2023 సంవత్సరంలో సమంత నిర్మాతగా మారారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్(Tralala Moving Pictures) అనే ప్రొడక్షన్ హౌస్ ను సమంత స్టార్ట్ చేశారు.ఈ నిర్మాణ సంస్థలో నిర్మించిన శుభం అనే సినిమా త్వరలో విడుదల కానుంది.
ఈ విషయాన్ని తెలుపుతూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

పెద్ద కలలతో మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నామని ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నానని ఇది నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం గొప్ప ప్రారంభం అని సమంత వెల్లడించారు.సమంతకు ట్విట్టర్ లో ఏకంగా 10.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.సమంత ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారని చెప్పవచ్చు.

“క్వీన్ ఈజ్ బ్యాక్”, “వెల్ కమ్ బ్యాక్ సామ్” అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం గమనార్హం.సమంత తెలుగులో నటించిన చివరి సినిమా ఖుషి కాగా ఆమె రీఎంట్రీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సమంత నిర్మాతగా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
హీరోయిన్ సమంత క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.