టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ప్రియాంక జవాల్కర్ ఒకరు.తెలుగమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar)మ్యాడ్ స్క్వేర్(Mad Square) సినిమాలో లైలా రోల్ లో నటించి మెప్పించారు.
ప్రియాంక జవాల్కర్ స్వస్థలం అనంతపురం కాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ట్యాక్సీవాలా(Taxiwala Movie) సినిమాతో తెలుగులో ఈ బ్యూటీ మంచి పేరు సంపాదించుకున్నారు.
ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ నేను సినిమాలలో ప్రయత్నిస్తున్నానని మా ఇంట్లో తెలుసని అలా నాకు విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆమె తెలిపారు.అయితే ట్యాక్సీవాలా(Taxiwala Movie) సినిమాలో తాను హీరోయిన్ గా నటిస్తున్నానని వారం రోజుల పాటు ఎవరికీ చెప్పలేదని అలా చేయడానికి భయమే కారణమని ఆమె కామెంట్లు చేశారు.

ట్యాక్సీవాలా గీతా ఆర్ట్స్(Taxiwala Geetha Arts) లాంటి పెద్ద సంస్థలో నా తొలి సినిమా కావడంతో ఆ సినిమాలో నేను ఉంటానో మధ్యలోనే తీసేస్తారో అనే భయం నాకు ఉండేదని ప్రియాంక పేర్కొన్నారు.ఆ సినిమాకు సంబంధించి కొంచెం నమ్మకం వచ్చిన తర్వాత నేను ఇంట్లో చెప్పానని ఆమె అన్నారు.ఆ సమయంలో నా పేరెంట్స్ కూడా ఎంతో సంతోషించారని తర్వాత నేను అందరికీ చెప్పుకున్నానని ప్రియాంక పేర్కొన్నారు.

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కెరీర్ షార్ట్ ఫిల్మ్స్ తో మొదలైంది.కలవరమాయే అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించారు.ఎస్.
ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసు, టిల్లు స్క్వేర్(S.R.Kalyana Mandapam, Thimmarusu, Tillu Square) సినిమాలలో ఆమె నటించగా ఈ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపును అయితే తెచ్చిపెట్టలేదని చెప్పాలి.ప్రియాంక జవాల్కర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ప్రియాంక జవాల్కర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







