సాధారణంగా సాయంత్రం మూడు లేదా నాలుగు సమయంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినాలనిపిస్తుంది.దాంతో ఎక్కువ శాతం మంది పకోడీ, మిర్చి బజ్జి, బర్గర్, పిజ్జా, పానీపూరి.
వంటివి తినడానికి మక్కువ చూపుతుంటారు.అయితే ఇవి రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు.
పైగా ఈ ఆహారాలు బెల్లీ ఫ్యాట్( Belly fat ) కు కారణం అవుతాయి.కానీ ఇప్పుడు చెప్పబోయే స్నాక్స్ ను తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.
అలాగే ఈ హెల్తీ స్నాక్స్ పొట్ట కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడతాయి.మరి ఇంతకీ ఆ స్నాక్స్ ఏవో తెలుసుకుందాం పదండి.

మఖానా లేదా తామర గింజలు( Makhana ).ఆరోగ్యానికి మేలు చేసే ఉత్తమమైన స్నాక్స్ గా చెప్పుకోవచ్చు.వేయించిన తామర గింజలు రుచిగా ఉంటాయి.పైగా తామర గింజలు తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.పొట్ట కొవ్వు కరుగుతుంది.సంతాన సమస్యలు ఉంటే దూరం అవుతాయి.
అలాగే సాయంత్రం వేళ స్నాక్స్ గా వేయించిన శనగలను కూడా తీసుకోవచ్చు.శనగల్లో ఫైబర్, ప్రోటీన్ మెండుగా ఉంటాయి.
ఇవి మీ కడుపును నిండుగా ఉంచుతాయి.ఇతర చిరు తిళ్లపై మనసు మళ్లకుండా చేస్తాయి.
ప్రస్తుతం చలి కాలం అయినందున సాయంత్రం వేళ వేడివేడిగా వెజిటేబుల్ సూప్( Vegetable Soup ) ను తయారు చేసుకుని తీసుకోవచ్చు.వెజిటేబుల్ సూప్ శరీరానికి మంచి హాయిని, వెచ్చదనాన్ని అందిస్తుంది.
మరియు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా హెల్ప్ చేస్తుంది.పాప్ కార్న్ చాలా సులభంగా తయారు చేసుకోగలిగే రుచికరమైన స్నాక్ ఇది.

పైగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాప్ కార్న్ ను ఇష్టపడతారు.అయితే పాప్ కార్న్ రుచిగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.పాప్ కార్న్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.రక్తపోటును అదుపులో ఉంచుతాయి.మరియు పాప్ కార్న్ ను తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది.ఇక మీరు మీ సాయంత్రం వేళ నట్స్, ఓట్స్, డార్క్ చాక్లెట్, ఫ్రూట్స్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు.