బాలయ్య అఖండ సీక్వెల్ వాయిదా పడనుందా.. ఆ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందా?

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య బాబు, బోయపాటి శ్రీను (Nandamuri Natasimham Balayya Babu, Boyapati Srinu)కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండ.ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Akhanda 2 Postponed To December, Akhanda 2, Post Pone, Tollywood, Akhanda, Balay-TeluguStop.com

ప్రగ్యా జైశ్వాల్(Pragya Jaiswal) హీరోయిన్గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2(Akhand 2) సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి బోయపాటి బాలయ్య బాబు కాంబో రిపీట్ అవుతోంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అఖండ 2ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.

ఈ సినిమాను దసరాకి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించడం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా విషయంలో అభిమానులకు నిరాశ కలగనుందని తెలుస్తోంది.ఎందుకంటే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతోన్న అఖండ2 చిత్రాన్ని(Akhand 2 MOvie) దసరా కానుకగా సెప్టెంబర్ 25(September 25) న విడుదల చేయనున్నట్లు గతంలో మూవీ మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ క్రేజీ మూవీ, ఆ డేట్ కి రిలీజ్ కావడం కష్టమనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

అఖండ 2 ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట.

Telugu Akhand, Akhanda, Balayya, Boyapati Srinu, Pone, Pragya Jaiswal, September

హిమాలయాల్లో ఇంతవరకు ఎవరూ చూపించని సరికొత్త లొకేషన్లలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట.ఇలా ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారట.అందుకే షూట్ కి అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు పట్టే అవకాశముందట.

హడావుడిగా షూట్ ని పూర్తి చేసే కంటే, ఆలస్యంగా వచ్చినా అంచనాలకు మించిన అవుట్ పుట్ తో సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారట.అందుకే సినిమాని డిసెంబర్ కి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ అదే జరిగితే అనుకున్న సమయం కంటే ఏకంగా మూడు నెలల తర్వాత ఈ సినిమా విడుదల కానుంది.అయితే గతంలో అఖండ కూడా 2021 డిసెంబర్ లోనే విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఇప్పుడు అఖండ 2 సినిమాని కూడా 2025 డిసెంబర్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube