బేబీ సినిమా(Baby Movie) ద్వారా హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).ఈమె సినిమాలలోకి రాకముందు పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపేవారు.
ఇలా ఈమె నటించిన వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో బేబీ సినిమాలో హీరోయిన్గా అవకాశం లభించింది.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వైష్ణవి చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
ఇక త్వరలోనే ఈమె సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా కలిసి నటించన జాక్ (Jack)అనే సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా పలు జిల్లాలకు వెళుతూ సందడి చేస్తున్నారు అయితే తాజాగా భీమవరంలో(Bheemavaram)ని విష్ణు కాలేజీలో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు.అందులో హీరో సిద్ధూ, హీరోయిన్ వైష్ణవి చైతన్యతో(hero Sidhu and heroine Vaishnavi Chaitanya) పాటు మూవీ యూనిట్ పాల్గొని సందడి చేశారు ఇక వైష్ణవి చైతన్య కూడా ఈ వేదికపై మాట్లాడుతూ కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు.

స్టూడెంట్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు తెలిపారు.అలాగే తనపై స్టూడెంట్స్ చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది.ఇలా ఎంతో ఉత్సాహంతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈమెఈ ఈవెంట్ ఏర్పాటు చేసింది భీమవరంలో అనేది మర్చిపోయి.రాజమండ్రి(Rajahmundry) అని అనేసింది.దీంతో స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు వెంటనే సిద్ధ జొన్నలగడ్డ అక్కడికి వచ్చి ఇది రాజమండ్రి కాదు భీమవరం అని చెప్పారు.