యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Young Tiger Jr.NTR)కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.తారక్ తన ప్రతిభతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఎన్టీఆర్ నటించిన దేవర(Devara) రికార్డును పెద్ది బ్రేక్(peddi movie) చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.తాజాగా విడుదలైన పెద్ది గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
24 గంటల్లో దేవర 26.17 మిలియన్ల వ్యూస్ సాధించగా పెద్ది మాత్రం ఏకంగా 30.8 మీయన్ల వ్యూస్ సాధించింది.దేవర రికార్డును పెద్ది 18 గంటల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం.ఎన్టీఆర్ రికార్డును చరణ్ (Charan)మూవీ బ్రేక్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా శ్రీరామనవమి పండుగ కానుకగ పెద్ది గ్లింప్స్ రిలీజ్ కావడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పెద్ది సినిమా వాస్తవానికి ఎన్టీఆర్(NTR) మిస్ చేసుకున్న సినిమా కావడం గమనార్హం.పెద్ది సినిమా కథ నచ్చినా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో తారక్ ఈ సినిమాను మిస్ చేసుకోవాల్సి వచ్చింది.అయితే పెద్ది సినిమాను మిస్ చేసుకొని తారక్ మంచి పని చేశారా? లేదా? అనే ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకనుంది.మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

పెద్ది సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.పెద్ది సినిమా సక్సెస్ సాధించడం డైరెక్టర్ బుచ్చిబాబుకు సైతం కీలకం అనే సంగతి తెలిసిందే.రామ్ చరణ్(Ram Charan) కు సైతం ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.