ఎలాంటి డైట్ అక్కర్లేదు.. ఈ ఒక్కటి తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు!

అధిక బరువు సమస్య( Overweight )తో బాధపడుతున్నారా? మీ శరీర బరువుపై ఇరుగు పొరుగు వారు చేసే కామెంట్స్ ను భరించలేకపోతున్నారా? బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా? నోరు కట్టుకొని ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ స్మూతీని తీసుకుంటే ఎలాంటి డైట్ అక్కర్లేదు.

 Best Green Smoothie For Weight Loss Without Diet , Green Smoothie, Healthy Smoot-TeluguStop.com

చాలా సులభంగా బరువు తగ్గొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కివీ పండును( Kiwi fruit ) తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అవకాడో( Avocado ) ని తీసుకుని లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేయాలి.అలాగే హాఫ్ అరటి పండును( Banana fruit ) తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కివీ పండు స్లైసెస్, అరటిపండు ముక్కలు మరియు అవకడో పల్ప్ వేసుకోవాలి.

అలాగే మూడు ఫ్రెష్ పాల‌కూర‌ ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు ఆల్మండ్ బటర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్ధమవుతుంది.ఈ గ్రీన్ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.

ముఖ్యంగా వెయిట్ లాస్ కు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ స్మూతీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.

బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.

అంతేకాదు ఈ గ్రీన్ స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఐరన్ పుష్కలంగా అందుతుంది.దాంతో రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.రక్తపోటును అదుపులో ఉంచడానికి కూడా ఈ స్మూతీ గ్రేట్ గా సహాయపడుతుంది.

అంతేకాదు ఈ స్మూతీ తీసుకుంటే కంటి చూపు రెట్టింపు అవుతుంది.గుండె జ‌బ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా సైతం ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube