కళ్ళు తెరిస్తే ఒక సమస్య తోనో ఒక భయం తోనో నిద్ర లేచే పరిస్థితులు ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్నారు , వృత్తిగత జీవితం లో సమస్యలు,ఆర్దిక ఇబ్బందులు వల్ల ప్రతిరోజూ యేదో ఒక సమస్య తో నిద్ర లేస్తాము.ప్రతిరోజూ యేదో ఒక సవాలు స్వేకరించడమో లేక సమస్య ను యెదుర్కోవడమో తప్పని పరిస్తితి, లేకపోతే ఈ పోటీ ప్రపంచం లో వెనుకబడిపోతామేమో అన్న భయం మనల్ని అంతర్లీనం గా వేదిస్తుంది .
ఆ భయం స్తాయి పెరిగితే అది ఒత్తిడి కి గురి చేస్తుంది.ఆ ఒత్తిడి నిరంతర ప్రక్రియలా మారితే మాత్రం అది మన మానసిక మరియు శారీరక ఆరోగ్యం( Physical health ) పై తీవ్ర ప్రభావo చూపిస్తుంది .అందువల్ల ప్రతి వ్యక్తి కూడా కెరీర్ తో పాటు వ్యక్తిగత ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం పై కూడా శ్రద్ద పెట్టాలి లేకపోతే ఒక వయసు దాటిన తరువాత మనం సాదించిన విజయాల్ని ఆస్వాదించే ఆరోగ్యం మనకు ఉండక పోవొచ్చు .అప్పుడు మనం ఎంత బాదపడినా చేజారిన సమయం తిరిగి రాదు .అందువల్ల యువత కెరీర్ పై దృస్తి పెడుతూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీద కూడా దృస్తి పెట్టాల్సి ఉంటుంది.ఈ క్రింది సూచనలు పాటించడం ద్వారా రోజువారీ ఒత్తిడి ని తొలగించుకునే ప్రయత్నం చేయండి . 1.ప్రతి రోజూ పాజిటివ్ ఆలోచన లతో నిద్ర లేవండి :
జీవితo చాలా చిన్నది ,మనం టెన్షన్ తో గడిపినా , ఆనందంగా గా గడిపినా, బాద తో గడిపినా, ఒకసారి గడిచి పోయిన ఒక్క క్షణం కూడా తిరిగి రాదు.ఈ విషయం గుర్తు పెట్టుకుంటే అర్దం లేని విషయాలకు బాద పడడం తగ్గుతుంది.అందువల్ల జీవితాన్ని సాధ్యమైనంత పాజిటివ్ ఆలోచనలతో గడపండి.మనం మార్చలేని పరిస్థితుల గురుంచి ఆలోచించి టెన్షన్ పడడం వృదా ప్రయాస అని గుర్తు పెట్టుకోండి.అందువల్ల రోజుని సాద్యమైనంత ఫ్రెష్ మూడ్ తో మొదలు పెట్టండి .మీరు చేయగలిగిన పనుల్లో మీ ముద్ర ఉండేలా జాగ్రత్త పడండి .నెగిటివ్ పరిస్థితుల్ని అంగీకరిచడం మొదలు పెట్టండి.సమస్య ని అంగీకరికంచడం మొదలు పెడితే అది ఎదుర్కునే దైర్యం సహజం గానే వస్తుంది .ఏల్లప్పుడు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నిచండి, దానివల్ల మీ శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ ఒత్తిడి ని తగ్గిస్తాయి .ఏ రకమైన పరిస్థితులు గాని మనుషులు గాని మీ నుండి నవ్వుని లాక్కొలేరని గుర్తు పెట్టుకోండి 2. శరీరం ఆరోగ్యం గా ఉంటే దాని ప్రబావo మనసు మీద కూడా పడుతుంది :
అందు వల్ల మంచి ఆరోగ్యపు అలవాట్లను అలవారుచుకోండి .రోజుకి 2 లీటర్ల( 2 liters ) మంచి నీళ్ళుతాగండి .టీ, కాపీ లు తగ్గించండి , మత్తు పదార్దాల అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి .రోజులో కనీసం అరగంట సేపు వ్యాయామానికి కేటాయించండి లేదా యోగా చేయండి .మీ లోని నెగిటివే ఆలోచనలను దూరం చెయ్యడానికి శరీరం ఆరోగ్యం గా ఉండడానికి “యోగా”( yoga ) ఎంతగానో ఉపకరిస్తుంది .ఆహారం మితం గా తీసుకోండి అదికూడా పోషకాహారం అయ్యి ఉండాలి జంక్ ఫుడ్ మరియు మసాలా ఆహార పదార్దాలు మన జీర్ణ శక్తిని దెబ్బ తీస్తాయి అందువల్ల వాటికి దూరం గా ఉండండి.తొందరగా నిద్రపొండి , ఉదయాన్నే నిద్రలేవండి అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా మనసు కూడా ఆరోగ్యం గా ఉండి ఒత్తిడి దూరం అవుతుంది.
3 .ఒక కొత్త అభిరుచి ని అలవారుచుకోండి :
ఒక కొత్త ఆరోగ్యకరమైన అబిరుచి ని అలవాటు చేసుకోండి. పుస్తకాలు చదవడం( Reading books ), లేదా చిన్న చిన్న కథలు రాయడం, సంగీతం నేర్చుకోవడం, పెయింటింగ్ లేదా ఫోటోగ్రఫి యేదైనా సరే మీ మనసుకి ఆహ్లాదం కలిగించే ఒక కొత్త అబిరుచి ని మనస్పూర్తి గా నేర్చుకోండి దీనివల్ల మీకు నూతన ఉత్తేజం కలిగి మనసు ఉల్లాసం గా ఉంటుంది.పుస్తకాలు చదవడం వల్ల మన ఆలోచన తీరు కూడా ప్రభావితం ప్రభావితం అవుతుంది మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు .అది మీ వ్యక్తిత్వాన్ని కూడా బలపరుస్తుంది .మీకు పుస్తకాలు చదవడం ఇష్టం లేకపోతే మిగిలిన హాబీ లు ప్రయత్నిచండి .కొత్త స్నేహాలు కూడా చేసుకోవచ్చు అయితే అవి వికటిస్తే మరింత ఒత్తిడి కి గురయ్యే అవకాశం ఉంది అందువల్ల దానిని ప్రయత్నిచకపోవడమే మంచిది .అయితే ఒక్క విష్యం గుర్తు పెట్టుకోండి మీరు నేర్చుకునే హోబి మీ వృత్తిగత జీవితానికి సంబందం లేనిది అయ్యి ఉండాలి లేకపోతే మొనాటని వస్తుంది.
4.విహార యాత్రలు చేయండి మానసిక ఆరోగ్యానికి , ఒత్తిడి ని దూరం చేసుకోవడాని విహార యాత్రలకు మించిన మందు లేదనే చెప్పాలి .కనీసం ఆరు నెలలకు ఒక్కసారి అయిన మీకు ఇష్ట మైన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్ళండి , ఇది మీ రోజువారీ పని ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసన్నీ కలిగిస్తాయి.అంతే కాదు కొత్త వాతావరణం కచ్చితం గా మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మీద ప్రబావమ్ చూపిస్తుంది.
తద్వారా ఆ ఎనర్జి తో మిగతా రోజుల్ని కూడా ఆనందం గా మొదలు పెట్టగలరు ఇన్ని పాటించినప్పటికి మీ పరిస్తిలో మార్పు రాకుండా ఇంకా ఒత్తిడికి గురి అయినట్లయితే కచ్చితం గా ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది .ఆలస్యం చేయకుండా దగ్గర్లో ఉన్న మంచి సైకాలజిస్ట్ ని కలవండి.అతను ప్రొఫెసనల్ కాబట్టి మీ సమస్యను సరిగా అర్దం చేసుకుని మీ కు అవసరమైన సహాయాన్ని చేస్తారు లేదా మీ సమస్యకు మెడిసిన్ అవసరం ఉంటే సైక్రీయార్టిస్ట్ కి రేకమెండ్ చేస్తారు .
.