టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరోయిన్ గా ప్రేమమ్(Premam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇలా నటిగా వరుసు సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓవెలుగు వెలుగుతున్నారు.ఇటీవల అమరన్, తండేల్(Amaran, Tandel) వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న రామాయణం(Ramayanam) అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో కెరియర్ పరంగా బిజీ అయ్యారు.ఇదిలా ఉండగా సాయి పల్లవికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఓ సర్వే ప్రకారం సాయి పల్లవి గురించి ప్రేక్షకులు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరిస్తున్నట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనిలను మించి ఈమె క్రేజ్ సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.ఇంస్టాగ్రామ్ లో దేశవ్యాప్తంగా తమిళ్ స్టార్ హీరో విజయ్(Vijay) కి సంబంధించి 20 శాతం.ఎంఎస్ ధోనీ(M.S Dhoni)కి సంబంధించి 17 శాతం మంది తెలుసుకోవాలని ఆసక్తి చూపగా సాయి పల్లవి గురించి తెలుసుకోవడానికి మాత్రం 25% మంది ఆసక్తి చూపుతున్నట్టు సర్వేలో వెల్లడి అయింది.

ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి ఘనత అందుకోలేదని.ఈ రికార్డు కేవలం సాయి పల్లవికి మాత్రమే దక్కిందని ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు.ఇక మిగిలిన సెలబ్రిటీలలో చాలామంది ఐదు శాతం వరకు జనాలను మాత్రమే ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ఈ రేంజ్ లో సాయి పల్లవి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఈమె పాపులారిటీ ఎలా ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.