టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో సాయి రాజేశ్( Director Sai Rajesh ) ఒకరు.హృదయ కాలేయం( Hrudaya Kaleyam ) సినిమాతో సంపూర్ణేష్ బాబు,( Sampoornesh Babu ) సాయి రాజేష్ కెరీర్ మొదలు కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
హృదయ కాలేయం సినిమా విడుదలై 11 సంవత్సరాలు కాగా “నా హీరో నా స్టార్” అంటూ సాయి రాజేశ్ సంపూర్ణేష్ బాబును మెచ్చుకున్నారు.
తాజాగా సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో గురించి ఒక నెటిజన్ స్పందిస్తూ ఇప్పుడు రోడ్డు మీద వదిలేశావ్ గా అంటూ కామెంట్ చేశారు.
ఆ కామెంట్ తన దృష్టికి రావడంతో సాయి రాజేష్ ఆ కామెంట్ గురించి రియాక్ట్ కావడం జరిగింది.సోదరా మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సాయి రాజేశ్ మాట్లాడుతూ సంపూర్ణేష్ బాబుతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

తన కోసం సంపూర్ణేష్ బాబు ఉంటారని సంపూర్ణేష్ బాబు కోసం తాను ఉంటానని ఆయన అన్నారు.నాతో సినిమా చేయడానికి ఏ హీరో డేట్స్ ఇవ్వని సమయంలో లైఫ్ వృథా అని అనుకున్నానని ఆ సమయంలో సంపూర్ణేష్ బాబుని చూశానని ఆయన తెలిపారు.ఆ సమయంలో నా కథలో ఇతనే హీరో అని ఫిక్స్ అయ్యానని సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.నాకు ఎంత అప్పు ఉన్నా కథపై కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లేవాడినని ఆయన కామెంట్లు చేశారు.

సిద్ధిపేటలో ఉండే సంపూర్ణేష్ బాబు హైదరాబాద్ కు వచ్చి కథా చర్చల్లో పాల్గొనేవాడని సాయి రాజేశ్ అన్నారు.తొలిరోజు సంపూర్ణేష్ బాబును బస్టాండ్ దగ్గర డ్రాప్ చేసి డబ్బులు ఉన్నాయా అని అడగగా ఆయన లేవని చెప్పారని నా వద్ద కొంత డబ్బు ఉంటే ఇచ్చానని ఆయన తెలిపారు.నేను అసలు తీయగలనా అనే సందేహం ఉండేదని ఊహించని విధంగా సినిమా పూర్తై సక్సెస్ అందుకుందని ఆయన తెలిపారు.సాయి రాజేశ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.