టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున నటులలో సిద్ధు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) ఒకరు.డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల విజయాలు సిద్ధు జొన్నలగడ్డకు ఎంతగానో ప్లస్ అయ్యాయి.
టిల్లు స్క్వేర్( Tillu Square ) మూవీ ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.వరుస విజయాలు సిద్ధు జొన్నలగడ్డ మార్కెట్ ను సైతం పెంచేశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే జాక్ సినిమాతో( Jack Movie ) సిద్ధు జొన్నలగడ్డకు భారీ షాక్ తగిలింది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు కాగా సినిమాలో అటు సిద్ధు జొన్నలగడ్డ మార్క్ లేకపోవడం, ఇటు బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ లేకపోవడం సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు.

హీరోయిన్ వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా సినిమా ఫలితం మాత్రం లేకుండా పోయింది.బీ.వీ.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత కాగా ఈ సినిమా నిర్మాణ విలువల విషయంలో కూడా కొంతమేర విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సినిమాలోని గ్రాఫిక్స్ షాట్స్ అస్సలు బాలేవని క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది.జాక్ మూవీ రిజల్ట్ నేపథ్యంలో సిద్ధు జొన్నలగడ్డ సినిమా సినిమాకు వైవిధ్యం చూపించాలని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సిద్ధు తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మాత్రం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.