మృత క‌ణాల‌ను తొల‌గించి ముఖాన్ని ఆక‌ర్ష‌ణీయంగా మార్చే రెమెడీ మీకోసం!

మృత కణాలు పేరుకుపోయే కొద్దీ చర్మం యొక్క నిగారింపు మరియు రంగు తగ్గిపోతుంది.చ‌ర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

పైగా చనిపోయిన చర్మ కణాలను తొలగించ‌క‌పోవ‌డం వ‌ల్ల మొటిమ‌లు, డార్క్ పాచెస్ వంటివి కూడా ఏర్ప‌డ‌తాయి.అందుకే ఎప్పటికప్పుడు చర్మంపై పేరుకుపోయిన‌ డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించాలని స్కిన్ కేర్ నిపుణులు చెబుతుంటారు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ప‌వ‌ర్ ఫుల్ హోమ్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీ చ‌నిపోయిన చ‌ర్మ క‌ణాల‌ను తొలగించడమే కాదు ముఖాన్ని అందంగా మరియు ఆకర్షణీయంగా కూడా మారుస్తుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్, వన్ టేబుల్ స్పూన్ ఎండిన గులాబీ రేకులు, వన్ టేబుల్ స్పూన్ పెసలు వేసుకొని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, పావు స్పూన్ పసుపు , హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు సరిపడా పచ్చి పాలు వేసుకుని స్పూన్ తో అన్ని కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Attractive Skin, Tips, Skin, Remedy, Skin Care, Skin Care Tips-Telugu Hea

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఒక పది నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం వేళ్ళతో సున్నితంగా స్క్ర‌బ్ చేసుకుంటూ నార్మల్ వాటర్ తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు, మురికి పోతాయి.

ముఖ చర్మం అందంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల చ‌ర్మ ఛాయ సైతం మెరుగుపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube