అందరిని కలుపుకుని బీజేపీపై పోరాటం చేస్తాం - సీపీఐ నారాయణ

విజయవాడ: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్స్.సీపీఐ జాతీయ మహా సభలకు 12 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు.14వ తేదీ నగరంలో ర్యాలీ, సింగ్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం.16న తేదీన సభలో విదేశీ ప్రతినిధులు ప్రసంగిస్తారు.18న నూతన జాతీయ కార్యవర్గం ఎన్నిక జరుగుతుంది.ప్రస్తుతం దేశం ఉన్న క్లిష్ట సమయాల్లో సీపీఐ సభలు జరుగుతున్నాయి.

 Cpi Narayana Shocking Comments On Central Bjp Government Details, Cpi Narayana,-TeluguStop.com

బీజేపీ చర్యల వల్ల దేశంలో అస్సలు రాజ్యాంగ ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది.సీపీఐ ఒక్కటే బీజేపీ ఒడిస్తామని చెప్పడం లేదు.

అందరిని కలుపుకుని బీజేపీపై పోరాటం చేస్తాం.కేసీఆర్ మొన్నటి వరకు బీజేపీతో అనుకూలంగా ఉన్నారు.

ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు.

బీజేపీకు ఎవరు వ్యతిరేకంగా పోరాటం చేసిన మేము మద్దతు ఇస్తాం.

దేశంలోని రాష్ట్రాల్లో బలమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ.కేంద్రం ఏది చెబుతుంటే వైసీపీ అది చేస్తుంది… ఎందుకో అర్ధం కావడం లేదు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా అణిచి వేస్తోంది.ప్రజలతో ఉంటారో… బీజేపీ తో ఉంటారో జగన్ తేల్చుకోవాలి.

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ అదానీ పైకి వచ్చారు.వైసీపీ ఎంపీ భూములు ఎలా అక్రమించుకుంటున్నారో విజయసాయిరెడ్డి చెబుతున్నారు.

విజయసాయిరెడ్డి ఎలా భూములు దోచుకుంటున్నారో వైసీపీ నేతలు చెబుతున్నారు.దేశంలో మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటానన్న జగన్…వైసీపీ నేతల భూ కబ్జాలపై సమాధానం చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube