ప్రస్తుత వర్షాకాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జలుబు సమస్య( Cold )తో బాధపడుతుంటారు.పైగా ఇంట్లో ఒకరికి జలుబు పట్టుకుందంటే మిగిలిన వారికి కూడా ఈజీగా వ్యాప్తి చెందుతుంది.
జలుబు చిన్న సమస్య అయినప్పటికీ దాని కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.పనిపై శ్రద్ధ వహించలేకపోతుంటారు.
ఏకాగ్రత దెబ్బతింటుంది.పైగా జలుబు వల్ల రాత్రుళ్లు సరైన నిద్ర కూడా ఉండదు.
ఈ క్రమంలోనే జలుబును వదిలించుకోవడం కోసం తెగ మందులు వాడేస్తుంటారు.

కానీ కొన్ని ఇంటి చిట్కాలతో( Homemade Remedies ) కూడా జలుబును నివారించుకోవచ్చు.అందరి ఇళ్లలో ఉండే ఉల్లిపాయ సైతం జలుబును రెండు రోజుల్లో మాయం చేయగలదు.మరి జలుబును వదిలించుకోవడానికి ఉల్లిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు( Garlic ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి మెత్తగా దంచి పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో( Onion Slices ) పాటు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కనీసం పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ వాటర్ ని తాగితే జలుబు ఎంత తీవ్రంగా ఉన్న సరే రెండు రోజుల్లో పరార్ అవుతుంది.త్వరగా జలుబు నుంచి బయటపడడానికి ఈ వాటర్ చాలా అద్భుతంగా సహాయపడతాయి.
జలుబు మాత్రమే కాదు దగ్గు సైతం దూరం అవుతుంది.కాబట్టి జలుబు దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు హైరానా పడిపోకుండా ఉల్లిని పైన చెప్పిన విధంగా తీసుకునేందుకు ప్రయత్నించండి.