కాజల్ అగర్వాల్…లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ఏకంగా 15 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించింది.ఇక నటిగా కెరీర్ ముగుస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని ఒక కొడుకుకి తల్లిగా కూడా మారింది.
కాజల్ అగర్వాల్ జీవితంలో ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం.ఆమె సినిమాలో నటిస్తున్న కాలంలో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది అంతే కాదు ట్రోలింగ్ కి కూడా గురయ్యింది.
ఆలా కాజల్ సృష్టించిన ఆ కాంట్రావర్సీలు ఏంటో ఓసారి చూద్దాం.
అల్లు అర్జున్ తో ప్రేమ విషయంలో కాజల్ ని మీడియా ప్రశ్నించగా అసలు తను ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ హీరో తో ప్రేమలో పడలేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చి ట్రోలింగ్ కి కూడా అయింది కాజల్.
మరో మారు ఫారెన్ బాయ్ ఫ్రెండ్ తో ఉంటే అతడు ఇండియా కల్చర్ ని అర్థం చేసుకోడని అందుకే ఎవరైతే తనని బాగా అర్థం చేసుకుంటారు అతను ఇండియాలోనే ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చింది.

ఇక మెన్స్ మ్యాగజిన్ లో టాప్ లెస్ గా ఫోటో ప్రచురితం కావడంతో బాలీవుడ్ లో పెను దుమారమే లేపింది కాజల్.ఇక బాలీవుడ్ కి వెళుతున్న సమయంలో ఆమె బాడీ పార్ట్ ని రివిల్ చేసేలా కాస్ట్యూమ్స్ ధరించి మరింత వార్తల్లోకి ఎక్కింది.
ఇక సినిమా ఇండస్ట్రీలో తను ఎవరితోనూ ఎక్కువగా కలిసి లేనని ఉన్నంతకాలం విలువలతో సినిమాల్లో నటించానని, ఏ హీరోతో ఎఫైర్స్ పెట్టుకుంటే తనకు సినిమా అవకాశాలు రాలేదంటూ సంచలన ప్రకటన చేసింది కాజల్.

దో లాఫ్జోన్ కి కహాని అనే సినిమాలో లిప్ లాక్ లేదని చెప్తూ ప్రకటన చేసిన తర్వాత ఆ సినిమాలో లిప్ లాక్ కనిపించడంతో అందరూ కాజల్ ఫేక్ కామెంట్స్ చేసిందని బాగా ప్రచారం చేసారు.
ఇక 61వ ఫిలింఫేర్ అవార్డులో కాజల్ ధరించిన డ్రెస్ కూడా వివాదాస్పదం అయింది ఆమె ధరించిన పింక్ డ్రెస్ చాలా రివీలింగ్ గా ఉండడంతో మీడియాకి కంటెంట్ ఇచ్చినట్టుగా అయిపోయింది.
ఇక 2019లో వచ్చిన పారిస్ మూవీలో తన తోటి హీరోయిన్ తో ఇంటిమేట్ సీన్ ఉండడంతో కూడా కాజల్ అనేక రకాల వివాదాలకు గురైంది.