వెయిట్ లాస్( Lose weight ) అవ్వాలని ప్రయత్నిస్తున్నారా.? అందుకోసం కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడం తో పాటు నిత్యం చెమటలు చెందేలా వర్కౌట్ చేస్తున్నారా.? అయితే మీ డైట్ లో ఖచ్చితంగా పొద్దుతిరుగుడు గింజలు ఉండాల్సిందే.ఈ గింజల్లో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్ తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి.
అందుకే పొద్దు తిరుగుడు గింజలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ముఖ్యంగా బరువు తగ్గాలని భావించే వారికి పొద్దుతిరుగుడు గింజలు ఒక వరం అనే చెప్పవచ్చు.
అవును ఈ గింజలను రెండు టేబుల్ స్పూన్లు చొప్పున ప్రతి రోజు నేరుగా తీసుకుంటే వద్దన్నా బరువు తగ్గుతారు.పొద్దుతిరుగుడు గింజలు అతి ఆకలిని దూరం చేస్తాయి.
శరీరాన్ని ఎక్కువసేపు ఎనర్జిటిక్ గా ఉంచేందుకు సహాయపడతాయి.అదే సమయంలో మెటబాలిజం రేటు పెంచుతాయి.
దీంతో క్యాలరీలు కరిగే వేగం పెరుగుతుంది.ఫలితంగా త్వరగా మరియు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
అలాగే రోజుకు రెండు స్పూన్లు పొద్దు తిరుగుడు గింజల( Sunflower seeds )ను తీసుకుంటే మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే పలు పోషకాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.పొద్దుతిరుగుడు గింజలను రోజూ తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు దెబ్బకు పరార్ అవుతాయి.నరాల బలహీనతను పోగొడతాయి.
పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.ఈ గింజల్లో ఉండే అమైనో యాసిడ్ ఒత్తిడిని దూరం చేసి మైండ్ ను రిలాక్స్ చేస్తుంది.మరియు మెదడు పని తీరును మునుపటి కంటే చురుగ్గా మారుస్తాయి.కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు మాత్రమే కాకుండా ఎవ్వరైనా ఈ గింజలను తీసుకోవచ్చు.