సాధారణంగా రివ్యూ లు రాయాలంటే మనసు చివుక్కు మంటుంది.తెలిసి ఏం రాయకపోయిన పర్వాలేదు కానీ తెలియకుండా ఒక సినిమాను లేదా కథను చంపెయ్యడం అనేది ఒప్పుకోలేము కదా.
ఇక చాల రోజుల తర్వాత ఒక రివ్యూ ఖచ్చితంగా ఇవ్వాలని అనిపిస్తుంది.అదే ఒక మలయాళ సినిమా అయినా ఇరట్ట.
తెలుగు లో ఓటిటి కోసం బాషా మార్చి విడుదల చేసారు.ఈ సినిమాలో అంజలి( Anjali ) వంటి హీరోయిన్ ఉన్న కూడా రెండు డైలాగ్స్ కూడా దర్శకుడు ఆమెతో చెప్పించలేదు.
కేవలం అంజలి మోముతోనే బావాలు పలికింది.ఇక సినిమా మొత్తంలో విలన్ లా కనిపించిన ఆ వ్యక్తే హీరో గా మిగిలిపోయాడు.
తను చేసిన ఒక తప్పు కు పశ్చాతాపం చెందిన ఒక్క క్షణంలోనే తనను తాను శిక్షించుకుంటాడు.గన్ను తో కాల్చుకొని చనిపోతాడు.సినిమా మొత్తం విలన్ గా కన్పించి క్లైమాక్స్ తో అందరిని బాధ పడే ఒక షాక్ లో వదిలేసాడు దర్శకుడు.ఎక్కడ కూడా ఒక్క హైప్ లేదు.
మనసుల్ని ఛిద్రం చేసే ఒక ఆలోచన అయితే ఈ సినిమా చూసాక కలుగుతుంది.జోసెఫ్( Joseph ) సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన జోజు జార్జ్( Joju George ) ఇందులో చాల బ్రిలియంట్ గా కనిపించాడు.
మలయాళీలకు మాత్రమే సాధ్యమైన స్క్రీన్ ప్లే ఇది.పొరపాటున కూడా మరొక భాషలో ఇలాంటి సినిమాలు రావు.చేసిన తప్పుకి విముక్తి మార్గం ఎంచుకునే పాత్రలో జోజు జార్జ్ నటన ఎంతో బాగా కనించింది.ఇరట్ట సినిమా దర్శకుడి పేరు రోహిత్( Rohit ) ఎం.జి.కృష్ణన్ ( M.G.Krishnan ).కేవలం ఒకే ఒక్క సీన్ సినిమాను ఆధ్యంతం చూసేలా చేస్తుంది.
సినిమా చూసాక అది మనల్ని నిత్యం ఒక హాంటింగ్ చేస్తూనే ఉంటుంది.భరించలేని ఆ బాధను ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు.ఇలాంటి సినిమాలు థియేటర్ కి వెళ్లే అవకాశం లేకపోవడం నిజంగా బాధాకరం.
కానీ మలయాళీ కథలకు ఉన్న డిమాండ్ కొట్టి తెలుగు ఓటిటి లు అక్కడి కథలను ఎంతో కొంత ఇచ్చి డబ్బింగ్ చేయించి వదులుతూ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.ఇక ఆ కథలను నమ్ముకునే పెద్ద హీరోలు తమ సినిమాలను తీసి విడుదల చేసి చేతులను కాల్చుకుంటున్నారు.
ఇప్పటికైనా మలయాళ సినిమా కథలు కాకుండ సొంత కథ రాసుకోవాల్సిందే.