సినిమా అనగానే ప్రతి ఒక్కరికి తెలియని ఆసక్తి అయితే ఉంటుంది.సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ రాణించాలని అనుకుంటూ ఉంటారు.
కానీ ఇక్కడ సక్సెస్ పర్సెంట్ అనేది చాలా తక్కువనే విషయం చాలా మంది మర్చిపోతారు.ఎవరికి వారు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.
అందులో భాగంగానే హీరోయిన్ల కెరియర్ అయితే ఇక్కడ చాలా తక్కువ కాలం పాటు ఉంటుందనే చెప్పాలి.

అయితే దాదాపు రెండు దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో తమ మనుగడను కొనసాగిస్తున్న హీరోయిన్ మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు.అందులో త్రిష,( Trisha ) నయనతార,( Nayanthara ) తమన్నా( Tamanna ) లాంటి హీరోయిన్లు ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఈ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను బాగా వాడుకుంటూ ముందుకు సాగుతున్నారు.అలాగే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం వల్ల సినిమా కెరియర్ అనేది ఎక్కువ కాలం పాటు కొనసాగుతుందనే చెప్పాలి.
ఇంకా ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు.హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.అందుకే ఈ ముగ్గురు హీరోయిన్లు 20 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇండస్ట్రీలో తమ హవాను కొనసాగిస్తూ ఉండడం విశేషం…

ఇక ఏది ఏమైనా ఇకమీదట కూడా వాళ్ళు మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తు ముందుకు సాగుతామంటూ తమ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండడం విశేషం…ఇక మీదట వాళ్ళు చేసే సినిమాలు కూడా భారీ విజయాలను సాధిస్తే వాళ్ళకంటు ఒక సెపరేట్ ఐడెంటిటీ ఏర్పడుతుందనే చెప్పాలి…మరి ఈ ముగ్గురు హీరోయిన్స్ హవా ఇక ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది…
.







