పళ్ళు తోముకునే టూత్ బ్రష్ ని వాష్ రూమ్ లో పెడుతున్నారా..? అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

ముఖ్యంగా చెప్పాలంటే మార్నింగ్ నిద్ర లేవగానే మొదటిగా మనం చేసే పని బ్రష్ ( Brush )చేసుకోవడమే అని దాదాపు చాలా మందికి తెలుసు.అలాగే రాత్రంతా పడుకుని ఉదయాన్నే బ్రష్ చేయకుంటే ఏదో అ సంపూర్ణం గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

 Are You Keeping The Toothbrush In The Washroom But These Health Problems Are In-TeluguStop.com

అయితే మనం పళ్ళు తోముకునే బ్రష్ ని మన పని పూర్తి అయిన తర్వాత బాత్రూంలో పెట్టడం చాలా మందికి అలవాటు ఉంటుంది.అయితే ఇలా బ్రష్ ను వాష్ రూమ్( Wash room ) లో పెట్టడం మంచిదేనా? కాదా? ఈ విషయం గురించి మనలో చాలా మందికి తెలియదు.అసలు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుని నోటి ఆరోగ్యాన్ని కాపాడుకునే బ్రష్ ను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి.

అయితే చాలా మంది టూత్ బ్రష్( Toothbrush ) ని బాత్రూంలో పెడుతూ ఉంటారు.ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.టూత్ బ్రష్ నీ టాయిలెట్ లో ఉంచితే చాలా సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

బాత్రూంలో టూత్ బ్రష్ ఉండడం వల్ల కంటికి కనిపించని సూక్ష్మజీవులు బ్రష్ పైకి వస్తాయి.ఇలాంటి బ్రష్ వాడితే అవి మన బాడీలోకి చేరి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.

బ్రష్ ని టాయిలెట్ దగ్గరలో ఉంచితే బ్రష్ పైకి విసర్జన అవశేషాలు చేరుతాయి.ఫ్లష్ చేసేటప్పుడు వచ్చే నీటి బిందువులు వాటితో పాటు కొన్ని క్రిములు బ్రష్ పైకి చేరుతాయి.

అవి కంటికి కనిపించవు.

ఇవన్నీ కూడా అంటూ వ్యాధులకు కారణం అయ్యే అవకాశం ఉంది.అయితే చాలా రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) వచ్చే అవకాశం ఉంటుంది.కాబట్టి బ్రష్ లను వాష్ రూమ్ లో అసలు పెట్టకూడదు.

అలాగే కచ్చితంగా బాత్రూంలోనే పెట్టుకోవాలనుకుంటే అప్పుడు బ్రష్ లను కేసులలో ఉండేలా చూసుకోవాలి.బ్రష్ చేశాక అవి ఆరాక వాటిని కేసుల్లో పెట్టడం మంచిది.

ఈ చిన్న పాటి జాగ్రత్తలను పాటిస్తే మన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube