తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సినీ ఫ్యామిలీలుగా మంచి గుర్తింపు పొందిన వారిలో మెగా ఫ్యామిలీ ( Mega Family ) అల్లు ఫ్యామిలీ ( Allu Family ) ఒకటి.ఈ రెండు కుటుంబాలకు తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
ఇకపోతే ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరుకున్నాయనే విషయం మనకు తెలిసిందే.
అల్లు అర్జున్( Allu Arjun ) పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కి కాకుండా వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్ట్ చేయడంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది.
ఇలా అల్లు అర్జున్ సపోర్ట్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండడంతో ఆయన తన అధికారాన్ని పరోక్షంగా అల్లు అర్జున్ పై ఉపయోగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇటీవల పుష్ప సినిమా( Pushpa Movie ) గురించి కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారని అల్లు అర్జున్ అభిమానులు మండిపడ్డారు.ఇలా ఈ వివాదం కొనసాగకుండా ఉండడం కోసం రెండు కుటుంబాల మధ్య సంధి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.
కానీ అల్లు అర్జున్ మాత్రం మెగా కుటుంబంతో సంధి అవసరం లేదని చెప్పకనే చెప్పేశారు.
ఇటీవల మెగా డాటర్ నిహారిక ( Niharika ) నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈమె సక్సెస్ పై అభినందనలు తెలియజేస్తున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాని పక్కన పెట్టి ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ నటించిన ఆయ్ సినిమాని ( Aay Movie ) ప్రమోట్ చేస్తూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.మెగా కుటుంబంతో సంధి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా నిహారిక సినిమాని కూడా ప్రమోట్ చేసేవారు అలా కాకుండా ఆయ్ సినిమాని ప్రమోట్ చేశారు అంటే మెగా కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.