ఎవరికైనా తగినంత ఎర్ర రక్త కణాలు లేనప్పుడు లేదా అవి సరిగా పనిచేయక పోయినప్పుడు శరీర అవసరానికి సరిపడా ఆక్సిజన్ ని అందించలేక పోతుంది.ఈ పరిస్థితినే రక్తహీనత అంటారు.
శరీరంలో ఐరన్ లోపించడంతో పాటు మరే ఇతర కారణాల వల్ల కూడా రక్తహీనత సమస్య రావచ్చు.అయితే ముందస్తుగా అన్ని జబ్బులకు లక్షణాలు కనిపించినట్లు.
రక్తహీనత సమస్యతో బాధపడే వారిలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.మరి ఆ లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
శరీరంలో తగినంత రక్తం లేకపోవడం వల్ల అవయవాలకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది.దీని వల్ల ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది.అంతేకాకుండా కొందరిలో గ్యాస్ ఫార్మేషన్ లేదా అజీర్తి వల్ల కూడా ఛాతిలో మంటగా ఉంటుంది.ఈ లక్షణాలు కనిపించిన వారు మొదటగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
రక్తహీనత ఉన్నవారికి సున్నపు పెంకులు, మట్టి గడ్డలు, బలపాలు, తదితర పదార్థాలను తినాలి అనిపిస్తుంటుంది.ఈ రకమైన లక్షణాలు ఉంటే వారిలో రక్తహీనత ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
రక్తహీనతతో బాధపడేవారికి శ్వాసకోస సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.ఇలాంటి వారు కొద్ది దూరం నడిచినా శ్వాస తీసుకోవడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు.
తొందరగా అలసిపోతారు ఇలాంటి లక్షణాలు కనపడే వారు కచ్చితంగా రక్తహీనతతో బాధ పడుతుంటారు.
రక్తహీనతతో బాధపడే వారి చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది.వీరిలో ఎర్రరక్త కణాల శాతం తగ్గిపోవడం వల్ల చర్మం తెల్లగా కనిపిస్తుంది.
తరచు తలనొప్పి వస్తున్నా అందుకు కారణం రక్తహీనత అయి ఉండవచ్చు.
కనుక తలనొప్పి వస్తున్న వారు రక్తహీనత ఉందని అనుమానించి, పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.