ముక్కు దిబ్బడ.చలి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిని ప్రధానంగా వేధించే సమస్య ఇది.ముఖ్యంగా ముక్కు దిబ్బడ ఏర్పడిందంటే రాత్రి వేళ శ్వాస తీసుకోవడానికి తెగ ఇబ్బంది పడుతూ నిద్ర పోలేకపోతుంటారు.పైగా ముక్కు దిబ్బడ వల్ల తీవ్రమైన తల నొప్పి, రక్తం కారడం, వాసన తెలియకపోవడం, ముక్కు నుంచి నీరు కారడం వంటి సమస్యలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటించడం ద్వారా సులభంగా ముక్కు దిబ్బడను వదిలించుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
సోంపు.జీర్ణ సమస్యలనే కాదు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది.అలాగే ముక్కు దిబ్బడను సైతం సోంపు నివారించగలదు.అవును, ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ సోంపును వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై ఫిల్టర్ చేసుకుని కాస్త తేనె కలిపి సేవించాలి.ఇలా చేస్తే ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అలాగే పెప్పర్మెంట్ ఆయిల్ ముక్కు దిబ్బడ నుంచి చాలా త్వరగా రిలీఫ్‌ను అందిస్తుంది.రెండు గ్లాసుల వాటర్‌ను బాగా మరిగించి.అందులో అర స్పూన్ పెప్పర్మెంట్ ఆయిల్‌ను వేయాలి.ఆపై కాసేపు ఆవిరి పట్టాలి.ఇలా చేస్తే సూపర్ ఫాస్ట్‌గా ముక్కు దిబ్బడను నివారించుకోవచ్చు.

ముక్కు దిబ్బడ సమస్యకు వెంటనే చెక్ పెట్టాలంటే టమోటా సూప్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకో వచ్చు.అవును, వేడి వేడిగా ఒక కప్పు టమోటా సూప్‌ను తీసుకుంటే శ్వాసకు అడ్డంకిగా ఉన్న అవరోధాలు తొలిగి పోయి ముక్క దిబ్బడ సమస్య దూరం అవుతుంది.
ఇక ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడే వారు.
వేడి వేడి నీటితో స్నానం చేయాలి.పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి.
వేడి వేడి సూప్‌లను తీసుకోవాలి.గ్రీన్ టీ, బ్లాక్ టీ, అల్లం టీ వంటి సేవించాలి.
సిట్రస్ పండ్లను తీసుకోవాలి.తద్వారా త్వరగా ఉపశమనాన్ని పొందుతారు.