బెల్లీ ఫ్యాట్‌‌ను ఈజీగా క‌రిగించే బెస్ట్ డిటాక్స్ డ్రింక్స్ ఇవే?

బెల్లీ ఫ్యాట్ లేదా పొట్ట చుట్టు కొవ్వు.స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.

 Best Detox Drinks For Losing Belly Fat! Best Detox Drinks, Losing Belly Fat, Bel-TeluguStop.com

కాళ్లు, చేతులు మ‌రియు ఇత‌ర శ‌రీర భాగాలు ఎంత స‌న్న‌గా ఉన్నా.పొట్టు చుట్టు మాత్రం లావుగా, చూసేందుకు అస‌హ్యంగా ఉంటుంది.

కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల ఈ బెల్లీ ఫ్యాట్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు ఎన్నెన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే డిటాక్స్ డ్రింక్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే.ఈజీగా పొట్ట చుట్టు ఉండే కొవ్వును క‌రిగించుకోవ‌చ్చు.

మ‌రి లేట్ చేయ‌కుండా ఆ డిటాక్స్ డ్రింక్స్ ఏంటో చూసేయండి.

అలోవెర డిటాక్స్  డ్రింక్ బెల్లీ ఫ్యాట్‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

సాధార‌ణంగా చాలా మంది అలోవెర‌ను చ‌ర్మ సౌంద‌ర్యానికి మ‌రియు కేశ సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగిస్తారు.కానీ, ఆరోగ్యానికి కూడా క‌ల‌బంద ఎంతో మంచిది.

ముఖ్యంగా పొట్టు చుట్టు కొవ్వు క‌ర‌గాలంటే.ఒక గ్లాస్ వాట‌ర్‌లో ఒక స్పూన్ క‌ల‌బంద గుజ్జు మ‌రియు ఒక స్పూన్ నిమ్మ ర‌సం యాడ్ చేసి సేవించాలి.

ఈ డిటాక్స్ డ్రింక్‌ బెల్లీ ఫ్యాట్‌ను ఫాస్ట్‌గా త‌గ్గిస్తుంది.

అలాగే నిమ్మ మరియు పుదీనా కాంబినేష‌న్ డిటాక్స్‌ డ్రింక్ కూడా పొట్ట కొవ్వును క‌రిగిస్తుంది.

ఒక గ్లాస్ వాట‌ర్‌ను కొన్ని పుదీనా ఆకులు, ఒక స్పూన్ నిమ్మ ర‌సం మ‌రియు రెండు నిమ్మ చెక్క‌లు వేసి బాగా మ‌రిగించాలి.ఆ త‌ర్వాత ఆ వాట‌ర్‌ను వ‌డ‌బోసి.

తీసుకోవాలి.రెగ్యుల‌ర్‌గా ఈ డ్రింక్ తీసుకుంటే.

బెల్లీ ఫ్యాట్ బ‌ర్న్ అవ్వ‌డంతో పాటు శ‌రీరం కూడా హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

పొట్ట చుట్టు పేరుకు పోయిన కొవ్వును త‌గ్గించ‌డంలో వాటర్ మెలోన్ డిటాక్స్ డ్రింక్ కూడా అద్భుతంగా స‌మాయ‌ ప‌డుతుంది.ఒక గ్లాస్ వాట‌ర్ తీసుకుని అందులో వాట‌ర్ మెలోన్ ముక్క‌లు మ‌రియు నిమ్మ ర‌సం యాడ్ చేసి తీసుకోవాలి.ఈ డ్రింక్ రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.

మెటబాలిజం రేటును పెరుగుతుంది.అతి ఆకలి త‌గ్గుతుంది.

బెల్లీ ఫ్యాట్ కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

Best Detox Drinks For Losing Belly Fat! Best Detox Drinks, Losing Belly Fat, Belly Fat, Latest News, Health Tips, Good Health, Health, Weight Loss Tips, Detox Drinks - Telugu Belly Fat, Detox Drinks, Tips, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube