తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార ( Nayanthara )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
ఇకపోతే నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను( Vignesh Sivan ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు.
అయితే నయన్ సరోగసి ద్వారా ద్వారా కవల పిల్లలకు తల్లి అయిన విషయం మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఒకవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నయనతార తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.తనకు, తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
కాగా మొన్నటికీ మొన్న పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నయనతారకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో నయనతార ఇద్దరి పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తోంది.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నయనతార పిల్లలు అప్పుడే అంత పెద్దగా అయ్యారా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇద్దరు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా ఇద్దరు కవల పిల్లలు కావడంతో ఇద్దరికీ ఒకే కలర్ డ్రెస్ ను వేసింది.
ఇద్దరికీ కూడా తండ్రి విగ్నేష్ శివన్ లాగే కర్లీ హెయిర్స్ ఉన్నాయి.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.