సాధారణంగా మన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది.ఉదాహరణకి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్, చెర్రీ – కాజల్, నాని – కీర్తి సురేష్, ప్రభాస్ – అనుష్క శెట్టి ఇలా ఎంతోమంది హీరో హీరోయిన్లు ఫ్రెండ్‌షిప్ చేస్తూ వస్తున్నారు.
వీరి స్నేహాన్ని చూస్తే మనకే జలసీగా అనిపిస్తుంది.అయితే కొన్నిసార్లు మూడో వ్యక్తి కారణంగా వీరి మంచి స్నేహం చీలిపోతుంది.
నిజంగా కొంతమంది మధ్య స్నేహం లేకపోయినా ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయాలు ఉంటాయి.అలాంటి వారి మధ్య కూడా శత్రుత్వాన్ని పెంచుతారు మూడో వ్యక్తులు.
జేజమ్మ అంటూ ముద్దుగా పిలుచుకునే అనుష్క శెట్టి, యంగ్ టైగర్ ఎన్టీఆర్( Anushka Shetty, Young Tiger NTR ) మధ్య కూడా మూడో వ్యక్తి కారణంగా ఒక కోల్డ్ వార్ నడిచింది.అంటే ఎవరికీ తెలియకపోయినా వారి మధ్య మాత్రం బాగానే యుద్ధం జరిగింది.
జూ.ఎన్టీఆర్ దాదాపు అందరూ సౌత్ ఇండియన్ హీరోయిన్లతో నటించాడు.కానీ అగ్రతార అనుష్కతో మాత్రం ఒక్క సినిమా కూడా అతను తీయలేదు.ఒక్కసారి మాత్రం స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.అది కూడా ఒక పాటలో! చింతకాయల రవి సినిమా మీరు చూసే ఉంటారు.ఇందులో వెంకటేష్, అనుష్క హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ మూవీలో ఒక పార్టీ సాంగ్ వస్తుంది.అప్పుడు అనుష్క, వెంకటేష్‌లతో ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తాడు.
దాని తర్వాత వీరిద్దరి కాంబోలో మళ్లీ ఎలాంటి సీన్లు, సినిమాలు రాలేదు.
వాస్తవానికి ఎన్టీఆర్ అనుష్క కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉంది.అదే శక్తి (2011).మెహర్ రమేష్ ( Meher Ramesh )ఈ మూవీలో అనుష్కను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకోవాలని భావించాడు.
అంతేకాదు సినిమా కథ చెప్పి ఆమెను ఒప్పించాడు.డేట్స్ కూడా తీసుకున్నాడు.ఈ క్రమంలోనే ఒక సీనియర్ నిర్మాత ఎన్టీఆర్ కి ఫోన్ చేసి అనుష్కతో సినిమా చేయకండి అని చెప్పాడట.“అరుంధతి సినిమా( Arundhati movie ) రూ.30 కోట్లు వసూలు చేసింది, ఏ హీరో సినిమా కూడా ఆ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయలేదు.కాబట్టి అనుష్క చాలా పొగరుగా మాట్లాడుతుంది.హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతుంది.” అని లేనిపోని చాడీలు చెప్పాడట.ఇది నిజమేనేమో అని జూనియర్ ఎన్టీఆర్ భావించాడు.అందుకే మెహర్ రమేష్ కి ఫోన్ చేసి అనుష్క వద్దు, ఇలియానాని హీరోయిన్‌గా ఎంపిక చేసుకోండి అని చెప్పాడట.
దాంతో మెహర్ చేసేది ఏమీ లేక ఆమెనే తీసుకున్నాడు.
అయితే అనుష్క శక్తి సినిమా కోసం డేట్స్ ఇవ్వడానికి ఒక మంచి కన్నడ సినిమాని వదులుకుంది.మరోవైపు ఎన్టీఆర్ ఆమె “మనకు అవసరం లేదు.” అని చెప్పి షాక్ ఇచ్చాడు.దీంతో ఆమెకు చాలా కోపం పెరిగిపోయింది.అందుకే ఇప్పటిదాకా తారక్ తో కలిసి ఒక సినిమా కూడా ఆమె చేయలేదని అంటారు.మొత్తం మీద ఒక నిర్మాత చేసిన పనికి వీరిద్దరి మధ్య అనవసరపు శత్రుత్వం ఏర్పడింది.