నేడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ ( Independence day ) వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ తరుణంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన( Upasana ) స్వాతంత్ర్యపు దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.ఇటీవల కోల్ కత్తాలో వైద్యురాలి పై జరిగిన హత్యాచార ఘటన గురించి ఈమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మానవత్వం లేకపోవడం చూస్తుంటే చాలా అసహ్యం కలుగుతుంది.ఒక మహిళ వైద్యురాలి పట్ల ఇలా జరగడం చాలా బాధాకరం ఈ విషయాన్ని ఎవరు గౌరవించడం లేదు.మన జీవితానికి ఇంకా గౌరవం ఎక్కడ ఉంది మనం ఇప్పటికీ అనాగరికత కొనసాగుతూ ఉంటే స్వాతంత్ర్యం జరుపుకోవాలా? ఒక అమ్మాయి పట్ల ఆ విధంగా ప్రవర్తించినవాడు నా దృష్టిలో మనిషే కాదు.ఇక మన దేశంలో ఆరోగ్య సంరక్షణలో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారని తెలిపారు.
ఎంతోమంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావడమే నా జీవిత లక్ష్యం అయితే తాజాగా జరిగిన ఈ ఘటన ద్వారా నా సంకల్పాన్ని మరింత బలపరిచింది.ఈ సమాజంలో ఉన్నటువంటి స్త్రీకి భద్రత రక్షణ అవసరం మనమందరం కలిసికట్టుగా ఉంటే ఈ సమాజంలో మార్పును తీసుకురావచ్చు అంటూ ఉపాసన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మనదేశంలో మహిళలకు రక్షణ లేదు అంటూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.