ఏడాదికి ఒకసారి హిమాలయాల్లో మాత్రమే కనిపించే అరుదైన పుష్పం బ్రహ్మకమలం.అలంటి అరుదైన పుష్పం పావన శ్రీరామ చంద్రుడు నడయాడిన భద్రాచలం లో పూసింది.
దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతుండగా సాక్షాత్తూ సరస్వతి దేవి జన్మించిన మూల నక్షత్రంరోజైన నేడు అరుదైన బ్రహ్మకమలం వికసించింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్రహ్మకమలం పుష్పాలు సరిగ్గా మూల నక్షత్రం ప్రారంభం అయిన గత రాత్రి ఒంటిగంట సమయంలో వికసించాయి.
ఈ పువ్వును శ్వేతకమలం అనికూడ అంటారు.ఈపుష్పం వికిసించిన కొద్దిగంటలు మాత్రమే తన అందా లతో కవ్విస్తూ తిరిగి ముడుచుకు పోతుంది.ఈపువ్వులో సృష్టికి మూల మైన బ్రహ్మ ఆసీనులైన ఉండటంచేత బ్రహ్మకమలం అని పులుస్తారు.అదేవిధంగా శివుడికి ఎంతో ప్రితీకరమైన పుష్పంగా అభివర్ణిస్తారు.
ఎంతో ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఈ పుష్పం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో తమ ఇంటిలో వికసించడంతో కుటుంబ సభ్యులు ఆనందోత్సహంతో బ్రహ్మకమలాని ఆరాధిస్తున్నారు.
ఈ పుష్పాన్ని చూసేందుకు ఇరుగుపొరుగు వారు అంత కూడా వస్తున్నారు.అనంతరం వీటిని అమ్మవారికి అలంకరించారు.అయితే గత నాలుగేళ్ళ క్రిందట హిమాలయాల నుండి ఈ బ్రహ్మకమలం మొక్కను తీసుకురాగా ఇన్నేళ్ళ తర్వాత పుష్ఫాలు వికసించడం పట్ల భద్రాద్రి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా మూలా నక్షత్రం రోజున ఇలా బ్రహ్మకమలం వికసించడం అన్ని వేల ఏళ్ళకొకసారి జరుగుతుందనీ శుభసూచికమని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL