చాతుర్మాసంలో ఇవి దానం చేస్తే అంతులేని పుణ్యఫలం..!

ఈ సంవత్సరం చతుర్మాసం( Chaturmasam ) జూన్ 29వ తేదీన మొదలవుతుంది.ఈ రోజు నుంచి అన్ని శుభకార్యాలను నిషేధిస్తారు.

 If You Donate These In Chaturmasam, You Will Get Endless Blessings , Chaturmasam-TeluguStop.com

ఈ సంవత్సరం చతుర్మాసం సరిగా ఐదు నెలల పాటు కొనసాగుతుంది.చతుర్మాస కాలాన్ని ఆషాడమాసంలోని ఏకాదశి నుంచి కార్తీక మాసంలోని ఏకాదశి వరకు పరిగణిస్తారు.

పౌరాణిక విశ్వాసాల ప్రకారం శ్రీ మహా విష్ణువు( Sri Maha Vishnu ) చతుర్మాస సమయంలో నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు.ఈ సమయంలో ఋషులు, సాధువులు అందరూ తపస్సులో నిమగ్నమై తీర్థయాత్రలు చేస్తారు.

చతుర్మాసంలో మనం ఏ ఏ వస్తువులను దానం చేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి.చతుర్మాసంలో చేసే దాన విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే దేవశయన ఏకాదశి ( Ekadashi )వ్రతం జూన్ 29వ తేదీన జరుపుకుంటారు.ఈ రోజు నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు.

అందుకే ఈ సమయంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారు.అలాగే వివాహం, నిశ్చితార్థం లాంటి శుభకార్యాలు చేయడం సరికాదని చెబుతున్నారు.

Telugu Bhakti, Chaturmasam, Devotional, Ekadashi, Sri Maha Vishnu-Latest News -

ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ వ్యాపారాలలో ఆందోళన ఉన్నవారు లేదా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారు చతుర్మాస సమయంలో గొడుగు, వస్త్రాలు, బియ్యం, కర్పూరం దానం చేయాలి.దీనివల్ల పరమేశ్వరుడి( Lord of Parameshwar ) అనుగ్రహం పొందడం తో పాటు వారి కోరికలన్నీ నెరవేరుతాయి.ఇలా చేయడం వల్ల వ్యాపార, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ప్రతి రోజు ఉదయం సాయంత్రం విష్ణువు సహస్రనామ స్తోత్రం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

Telugu Bhakti, Chaturmasam, Devotional, Ekadashi, Sri Maha Vishnu-Latest News -

సాధారణంగా చతుర్మాసంలో ఈ తప్పులను అస్సలు చేయకూడదు.చతుర్మాసం నాలుగు నెలల పాటు కొనసాగుతుంది.అయితే ఈ చతుర్మాసం మాత్రం ఐదు నెలలు పాటు కొనసాగుతుంది.ఈ 5 నెలల్లో మీరు చక్కెర, పెరుగు, నూనె, బెండకాయ, ఉప్పు, కారం, మిఠాయిలు, తమలపాకులు, మాంసం, మద్యం మొదలైన వాటికి కచ్చితంగా దూరంగా ఉండాలి.

ముఖ్యంగా చెప్పాలంటే చతుర్మాసంలో చేసే దానధర్మాలు కూడా మనకు మంచి పుణ్య ఫలితాలను ఇస్తాయి.అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కావాలంటే చతుర్మాసంలో ఈ పైన చెప్పిన పనులన్నీ కచ్చితంగా పాటించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube