మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఒక మహిళ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఇది జిల్లాలోని ఏకతా నగర్ చౌక్ ( Ekta Nagar Chowk )వద్ద చోటుచేసుకుంది.లోకల్ న్యూస్ మీడియా అందించిన సమాచారం ప్రకారం, ఒక కపుల్ తమ ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా, అతివేగంగా వస్తున్న మరో బైక్ వారిని ఢీకొట్టింది.
ఈ ప్రభావంతో వెనుక కూర్చున్న మహిళ రోడ్డుపై పడిపోయింది.అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మరో వ్యక్తితో పాటు, అతివేగంగా వస్తున్న బైక్‌ను నడుపుతున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అతివేగంగా బైక్ నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మృతురాలు విజయనగర్‌కు చెందిన శ్రీ ప్యాసిగా పోలీసులు గుర్తించారు.ఆమె భర్త పేరు అతుల్ ప్యాసి( Atul Payasi ).శ్రీ, అతుల్ దంపతులు బైక్‌పై రోడ్డు దాటుతున్నప్పుడు వారిని ఇంకోవైపు నుంచి వస్తున్న మరొక బైకర్ ఢీకొట్టడం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది.ఆ తర్వాత అతని కింద పడిపోవడం అతని భార్య విగత జీవిగా రోడ్డు మీద పడిపోవడం కనిపించింది.
ఆమెని ఆ భయంకర చాలా బలంగా ఢీకొట్టాడు వారి తలలు కూడా ఒక దానికి ఒకటి బలంగా గుద్దుకున్నట్టు తెలిసింది.శ్రీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అతుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో( Kotwali Police Station ) కేసు నమోదు చేయబడింది.పోలీసులు అతివేగంగా వచ్చిన బైక్‌ను నడుపుతున్న వ్యక్తిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు.
బాధిత కుటుంబానికి అయిన న్యాయం చేస్తామని వారు అంటున్నారు.ఈ ప్రమాదం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఎంతటి విషాదం చోటు చేసుకుంటుందో చూపిస్తోంది.
దయచేసి, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.