దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!

వామ్మో.ఈ కేటుగాళ్లు చాలా డేంజర్ గురు.

 Chhattisgarh Locals Duped By Fake Sbi Branch Details, Fake Sbi Branch, Chhattisg-TeluguStop.com

ఏకంగా అక్రమ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు, నకిలీ శిక్షణా సెషన్‌లు, ఎస్బిఐ నకిలీ బ్రాంచ్ ను( Fake SBI Branch ) ఏర్పాటు చేశారు.ఇది ఎక్కడో కాదండి.

ఛత్తీస్‌గఢ్‌లో( Chattisgarh ) చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్ కు 250 కి.మీ.దూరంలో ఉన్న ఛపోరా గ్రామంలో నిరుద్యోగ యువకులను అక్కడి స్థానికులు పక్కా ప్లాన్ తో మోసం చేసేందుకు సిద్ధమయ్యారు.అక్రమ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లు,( Fake Recruitment Drives ) నకిలీ శిక్షణా సెషన్‌లు, ఏర్పాటు చేయడంతో పాటు ఏకంగా నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ ను కూడా ఏర్పాటు చేశారు.

అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ఈ ఫేక్ బ్యాంక్ సెప్టెంబర్ నెల నుంచి పని చేస్తున్నట్లు అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు.

Telugu Chattisgarhsbi, Chhattisgarh, Sbi Branch, Lakhs, Locals, Duped, Sbi Bank,

ఇక ఈ ఫేక్ బ్యాంకు ముందు ఎస్బిఐ బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు.కేవలం బ్యానరే కాకుండా కొత్త ఫర్నిచర్, ఇంకా బ్యాంకు కు ఉండాల్సిన సెటప్ మొత్తం ఏర్పాటు చేశారు ఈ మాయగాళ్లు.అది ఎలా అంటే.

అచ్చం ఒరిజినల్ స్టేట్ బ్యాంక్ లాగే అన్ని లావాదేవులు కూడా చేసినట్లు అక్కడి స్థానికులు తెలిపారు.అయితే.

, వీటి గురించి ఎటువంటి అవగాహన లేని స్థానికులు బ్యాంకు ఖాతాలు( Bank Accounts ) తెరవడం మొదలుపెట్టడంతో పాటు ఆర్థిక లావాదేవాలు చేయడం కూడా మొదలు పెట్టేశారు.ఇక ఈ ఫేక్ బ్యాంకు ఉద్యోగుల పనులను ఎవరు పట్టించుకోలేదు.

అలాగే సమీపంలోని డాబ్రా బ్రాంచ్ మేనేజర్ ఎస్బిఐతో దాన్ని చట్టబద్ధతపై అనుమానాలు లేవనెత్తే వరకు అంతా బాగానే ఉంది.

Telugu Chattisgarhsbi, Chhattisgarh, Sbi Branch, Lakhs, Locals, Duped, Sbi Bank,

కానీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఎస్బిఐ అధికారులతో పాటు పోలీసు బృందం దాడులు చేపట్టడంతో అసలు మోసం బయటపడింది.ఆ మాయగాళ్లు రిక్రూట్మెంట్ డ్రైవ్ పేరుతో అక్కడి వారి స్థానికుల నుంచి దాదాపు రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.అనంతరం నకిలీ అపాయింట్మెంట్ లెటర్లను అందించేశారు.

ఇక చివరికి పోలీసు దాడిలో కంప్యూటర్లు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.భారతీయ న్యాయ సంహిత కింద ముగ్గురు ఆపరేటర్లు బ్యాంకు మేనేజర్ గా వ్యవహరించిన సూటదారితో సహా పలువురి పై కేసు నమోదు చేసినట్టు పోలీస్ అధికారులు తెలియజేశారు.

ఇంకా ఇలా ఎంతమందిని మోసం చేశారు అంటూ ఎవరి దగ్గర నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారని అధికారులు విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube