టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ పై( Allu Arjun ) కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై నంద్యాలలో( Nandyala ) నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఎన్నికల సమయంలో సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జన సమీకరణ చేపట్టారు అంటూ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే దానిని కొట్టేయాలి అంటూ అల్లు అర్జున్ తో పాటుగా మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.కాగా నేడు ఈ కేసు కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు( AP High Court ) తుది తీర్పును వెల్లడించనుంది.అల్లు అర్జున్ పిటిషన్ ని ( Allu Arjun Petition ) హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టు పరిశీలించింది.నేడు అనగా నవంబర్ ఆరవ తేదీన తీర్పుని ఇవ్వనున్నట్లు ధర్మాసనం ప్రకటించడంతో ఈ విషయం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే బుధవారం తెల్లవారుజామున అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి( Sneha Reddy ) తిరుమల కు చేరుకున్నారు.ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో స్వామివారిని ఆమె దర్శించుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్కి ఈ కేసు విషయంలో ఊరట లభించాలని అందుకోసమే స్నేహారెడ్డి తిరుమల కు చేరుకున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.