చర్మంపై ముడతలు.ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది.కేవలం పాతికేళ్లకే ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు.వృద్ధాప్యంలో సహజంగా వచ్చే ఈ ముడతలు నేటి కాలంలో చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి.ముఖ్యంగా అమ్మాయిలు ముఖంపై ముడతలు చూస్తేనే భయపడిపోతుంటారు.ఈ క్రమంలోనే మార్కెట్‌లో లభ్యమయ్యే ఏవేవో క్రీములను ఎంతో ఖర్చు పెట్టి.
కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.ఫలితం లేకపోతే చింతిస్తుంటారు.
అయితే వాస్తవానికి ఇంట్లో ఉండే పదార్థాలతోనే ముడతలను మాయం చేయవచ్చు.అదెలా ఇప్పుడు తెలుసుకుందాం.

ముడతలతో బాధ పడుతున్న వారు.ఒక బౌల్ తీసుకుని అందులో బొప్పాయి గుజ్జు, అరటి పండు గుజ్జు మరియు కొద్ది తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసి.బాగా ఆరిపోనివ్వాలి.ఒక ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల ముడతలు క్రమంగా తగ్గి.
చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.

రెండొవది.ఒక బౌల్ తీసుకుని అందులో కలబంద గుజ్జు మరియు రోజ్ వాటర్ వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.
ఒక అరగంట పాటు వదిలేయాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల.కలబందలో ఉండే విటమిన్ బి,సి లు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.
ముడతలను తగ్గిస్తాయి.

మూడొవది.ఒక బౌల్‌లో ఎగ్ వైట్ వేసుకుని అందులో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం యాడ్ చేసి మిక్స్ చేయాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
పది నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల చర్మంపై ముడతలు, సన్నని గీతలు పోయి.ముఖం కాంతివంతంగా మారుతుంది.