నటి కస్తూరిపై కేసు నమోదు.. క్షమాపణ చెప్పిన వదలడం లేదుగా!

టాలీవుడ్ ప్రముఖ నటి కస్తూరి శంకర్( Kasthuri Shankar ) గురించి అందరికీ తెలిసిందే.తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కస్తూరి శంకర్.

 Police Filed Case Against Tamil Actress Kasthuri On Speech About Telugu People D-TeluguStop.com

అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఆమె తెలుగువారిని( Telugu People ) ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తెలుగువారిపై చేసిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారమే రేపుతున్నాయి.

అంతేకాకుండా తీవ్ర స్థాయిలో ఆమెపై మండిపడడంతో పాటు విమర్శలు రావడంతో కాస్త వెనక్కు తగ్గిన కస్తూరి శంకర్ క్షమాపణలు కూడా కోరిన విషయం తెలిసిందే.పలువురు ఆమెపై కేసులు కూడా పెట్టడంతో సెక్షన్ల కింద ఆమెపై కేసులు కూడా నమోదు అయ్యాయి.

Telugu Actresskasthuri, Chennai Egmore, Kasthurishankar, Kasturi Shankar, Telugu

చెన్నై ఎగ్మూర్ పోలీసులు( Chennai Egmore Police ) 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అవమానితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో నవంబర్‌ 4న చెన్నైలో నిరసన కార్యక్రమం కూడా జరిగింది.ఆ కార్యక్రమంలో నటి కస్తూరి అంతఃపురంలో సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువాళ్లని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.అయితే ఈ సందర్భంలో తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి ఆ మాటలు వెనక్కి తీసుకున్నానని అన్నారు.

కాగా కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.ఈ మేరకు కస్తూరి మాట్లాడుతూ.

Telugu Actresskasthuri, Chennai Egmore, Kasthurishankar, Kasturi Shankar, Telugu

తమిలుల మధ్య విభజన ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడే ద్రావిడ డయాస్పోరా మోసగాళ్ల ద్వంద్వ ప్రమాణాన్ని నిన్న నేను బయటపెట్టాను.డీఎంకే( DMK ) నాపై తెలుగు వ్యతిరేకులని దుష్ప్రచారం చేస్తూ నాపై దుష్ప్రచారం చేస్తోంది.నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ ఫేక్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు.బ్రాహ్మణ కమ్యూనిటీని వంటేరి అని పిలిచే వారు తమిళులేనా అని ప్రశ్నించాను.బ్రాహ్మణులపై ఇంత విద్వేషం ఎందుకు వ్యక్తిగత దాడులను ఎదుర్కోలేక పోతున్నాను అని ఆమె పేర్కొంది.నిన్న చెన్నైలోని ఎగ్మూర్‌లో హిందూ పీపుల్స్ పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది.

బ్రాహ్మణ సంఘం పరువుకు భంగం కలిగించడాన్ని ఖండిస్తూ ఈ ప్రదర్శన నిర్వహించారు.దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించే చట్టం తరహాలో బ్రాహ్మణ వర్గాలకు రక్షణ కల్పించేలా చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు.

మరో పక్క నటి కస్తూరిపై కేసు కూడా నమోదైంది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube