జలుబు చేసినప్పుడు పొరపాటున కూడా ఈ ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు.. తెలుసా?

ప్రస్తుత వర్షం కాలంలో వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో జలుబు సమస్యతో బాధపడుతూ ఉంటారు.జలుబు అనేది చిన్నదే అయినా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

 What Foods Should Avoid During Cold? Cold, Health, Health Tips, Good Health, Lat-TeluguStop.com

ఒక్కోసారి జలుబు వల్ల జ్వరం, దగ్గు వంటివి కూడా పట్టుకుంటాయి.అయితే జలుబు చేసినప్పుడు పొరపాటున కూడా కొన్ని కొన్ని ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు.

మరి ఆ ఫుడ్స్ ఏంటి.వాటిని ఎందుకు తీసుకోకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా జలుబు( Cold ) చేసినప్పుడు పెరుగు తినవద్దని చెబుతుంటారు.పెరుగు తిన్నా ఎలాంటి సమస్య ఉండదు.కానీ, పాలు మాత్రం తీసుకోకూడదు.పాలు తాగితే శ్లేష్మం పెరుగుతుంది.

జలుబు త్వరగా తగ్గదు.జలుబు చేసినప్పుడు పంచదార, పం
చదార తో తయారు చేసిన ఆహారాలను పూర్తిగా దూరం పెట్టాలి.

షుగర్ ఇమ్యూనిటీ సిస్టం ను బలహీనపరుస్తుంది.దీని కారణంగా జలుబు తగ్గకపోగా మరెన్నో సీజనల్ వ్యాధులు చుట్టుముట్టేస్తాయి.

Telugu Tips, Immune System, Latest, Monsoon Season, Foods-Telugu Health

జలుబు బారిన పడినప్పుడు పన్నీర్, బ‌ట‌ర్‌, ఐస్ క్రీమ్ వంటి ఫుడ్స్ కు దూరంగా ఉండండి.ఇవి జలుబును మరింత తీవ్రంగా మారుస్తాయి.జలుబు చేసినప్పుడు కాఫీ( Coffee )ని పొరపాటున కూడా తాగొద్దు.కాఫీ తాగితే జలుబు ఓ పట్టాన తగ్గనే తగ్గదు.

అలాగే పండ్ల రసాలు అస్సలు తాగకండి.ఫ్రూట్స్ నేరుగా తీసుకున్న పర్వాలేదు.

కానీ జ్యూస్ చేసుకుని తీసుకోవద్దు.ఇక ఆల్కహాల్, ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ వంటి ఆహారాల జోలికి అస్సలు వెళ్ళకండి.

ఎందుకంటే ఇవి జలుబును రెట్టింపు చేస్తాయి.

Telugu Tips, Immune System, Latest, Monsoon Season, Foods-Telugu Health

అయితే జలుబు త్వరగా తగ్గడానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.

పైనాపిల్, వాల్ నట్స్, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, నిమ్మ వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.వీటిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.

అందువల్ల వీటిని తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ ( Immune system )బలపడుతుంది.జలుబు చాలా త్వరగా నయం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube