సనాతన హిందూ సంప్రదాయంలో( Hindu tradition ) రోజు దేవుని పూజించే ఆచారం ఉంది.ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అలాగే దైవానుగ్రహంతో రోజు ఎదురయ్యే కష్టానష్టాలను ఎదురుకునే బలం చేకూరుతుందని అందరూ భావిస్తారు.అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి రోజు ఆరాధన చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
హిందూ మతంలో వివిధ దేవతలు, దేవుళ్లను ఆరాధించడానికి ఎన్నో రకాల ఆచారాలు నిర్దేశించబడ్డాయి.అయితే దేవుడికి పూజ చేసే సమయంలో దీపం( Deepam ) వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది.

రాత్రి సమయంలో దీపం వెలిగించడంతో చీకట్లు తొలగిపోతాయి.అలాగే భగవంతుని ఆరాధించే సమయంలో వెలిగించే దీపం జీవితంలో ఏర్పడిన చీకట్లను తొలగిస్తుందని ఒక నమ్మకం.ఏదైనా పూజకైనా, శుభకార్యాలకైనా ముందుగా దీపం ప్రత్యేకంగా వెలిగించడానికి కారణం కూడా ఇదే.ఏదైనా శుభకార్యక్రమంలో దేవతామూర్తుల ఆరాధనలో దీపాలు వెలిగించడానికి సంబంధించిన చర్యలు, దానికి అవసరమైన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.జీవితంలో ఆర్థిక సమస్యలు ఉంటే వాటిని తొలగించేందుకు నియమాలు, నిబంధనల ప్రకారం ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి.అంతేకాకుండా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించాలి.
ఇలా చేయడం వలన లక్ష్మీదేవి( Goddess Lakshmi ) సంతోష్టులై తన ప్రత్యేక కృపను కొనసాగిస్తుంది.జాతకంలో ఎలాంటి గ్రహదోషం( Grahadosham ) ఉన్నా కూడా నివారణకు పిండితో చేసిన చతుర్ముఖ దీపంలో నూనె రాసి రోజు వెలిగించాలి.
ఇలా చేయడం వలన గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలు, శని నుండి విముక్తి పొందవచ్చు.ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే లేదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఇంటి తలుపు ఇరువైపులా దీపం వెలిగించాలి.

అలాగే తలుపు వద్ద పెట్టిన దీపంలో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించాలి.ఇలా చేయడం వలన ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.ఇంట్లో పూజలు చేసే సమయంలో ఆలయంలో దీపం వెలిగించినప్పుడు అంతా దీపం జ్వాలా తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోవాలి.అలాగే దీప జ్వాల పడమర వైపు ఉండకూడదు అని గుర్తుంచుకోవాలి.
పూజ చేసేటప్పుడు పగిలిపోయిన కుందెలను అస్సలు ఉపయోగించకూడదు.