మన భారతదేశంలోని ఆలయాల్లో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.వీటి వెనుక మిస్టరీని చదివించడానికి చాలామంది పరిశోధకులు ఎన్నో సంవత్సరాల నుండి పరిశోధనలు చేస్తున్నారు.
కానీ ఇప్పటికీ కూడా వీరికి ఈ ఆలయాలకు సంబంధించి ఎలాంటి రహస్యాలు తెలియలేదు.అయితే శాస్త్రవేత్తలకే సవాల్ గా విసురుతున్న ఐదు రహస్య శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిది లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం( Shri Veerabhadra Swamy Temple ) ఈ ఆలయంలో అణువణువు ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం సమీపంలో కొలువుదీరి ఉన్న ఈ ఆలయాన్ని 15వ శతాబ్ద కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అచ్యుతరాయుల సంస్థానంలో కోశాధికారిగా పనిచేసే విరూపణ కట్టించాడు.

అయితే 70 స్తంభాలతో అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించిన ఈ ఆలయంలోని అంతరిక్ష స్తంభానికి ఎంతో ప్రత్యేకత ఉంది.అయితే ఈ గుడిలో 69 స్తంభాలు నేల మీద నిలబడి ఉంటే ఈ ఒక్క స్తంభం మాత్రం ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో తేలుతూ ఉంటుంది.ఈ కట్టడానికి ఈ ఒక్కసారిగా బీటలు రావడంతో ఎంతగానో భయపడిన ఇంజనీర్ వెంటనే ఆ పనిని విరమించుకున్నాడట.దీంతో ఇప్పటికీ ఆ స్తంభం గాలిలో వేలాడుతూనే ఉంది.
ఇక రెండవది బృహదీశ్వరాలయం తంజావూర్ బృహదీశ్వర ఆలయం( Brihadeeswara Temple ) భారతదేశంలోని మిస్టరీస్ ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ లో ఈ ఆలయం ఉంది.

ఈ ఆలయం 11వ శతాబ్దంలో చోళ రాజైన రాజరాజ చోళులు నిర్మించారు.ఈ దేవాలయాన్ని 30 వేల టన్నుల గ్రానైట్ తో నిర్మించారు.అయితే ఈ 30 వేల టన్నుల గ్రానైట్ ని ఇక్కడకు ఎలా తీసుకొచ్చారనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది.ఇక ముఖ్యంగా ఈ ఆలయ గోపుర కలశం కూడా 80 టన్నుల ఏక శిరతో నిర్మించబడింది.
ఇక మూడవది కైలాస దేవాలయం ( Kailasa Temple )ఎల్లోరా మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ నగరానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని కేవో 16 లో ఈ కైలాస దేవాలయం ఉంది.అయితే ఈ దేవాలయంలో కూడా ఎన్నో రహస్యాలు ఉన్నాయి.
అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు అన్నది ఇప్పటికీ కూడా రహస్యంగానే ఉంది.ఈ విధంగానే భారతదేశంలో ఇంకా ఎన్నో ఆలయాలు రహస్యాలతో ముడిపడి ఉన్నాయి.