జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుపై మాజీమంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జనసేన అసలు రాజకీయ పార్టీనేనా అని ప్రశ్నించారు.
చంద్రబాబు కోసం పవన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
బీసీ డిక్లరేషన్ ఏమైందో చెప్పాలని పేర్నినాని నిలదీశారు.
పవన్ కల్యాణ్ కు నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు.జనసేనను ప్రజల కోసం పని చేసే పార్టీ ఎలా అంటారో చెప్పాలన్నారు.విడివిడిగా కాదు కలిసే రండన్న పేర్ని నాని అందరినీ చితగొట్టి ఇంటికి పంపిస్తామని తెలిపారు.2014లో కాపు కులాన్ని చంద్రబాబు దగ్గర పెట్టారన్నారు.మచిలీపట్నంలో పవన్ తియ్యటి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు.బీజేపీతో కటీఫ్ అని చెప్పిన పవన్ చిరంజీవిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారని చెప్పారు.రాజకీయం కోసం పవన్ అన్న అని కూడా చూడరని విమర్శించారు.పార్టీ పెట్టి మూసింది ఎవరని పేర్ని నాని ప్రశ్నించారు.







